
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కోటేశ్వరమ్మ కు 5000 ఆర్థిక సాయం..
అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్..
పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 8 :-రిపోర్టర్( కే శివకృష్ణ )
అగ్ని ప్రమాదానికి ఆహుతైన కుటుంబానికి కొండంత అండగా నిలిచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కోటేశ్వరమ్మకు ధైర్యం చెప్పిన అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు బాపట్ల జనసేన నాయకులు విన్నకోట సురేష్, బాపట్ల నియోజకవర్గం నల్లమోతువారి పాలెం లో నివాసం ఉంటున్న రాసూరి సాంబయ్య, గత ఆరు నెలల క్రితం భార్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృత్యువాత పడింది. అప్పటినుండి సాంబయ్య ఒక్కడే ఆ గృహంలో జీవనం సాగిస్తున్నాడు.. అయితే ఆదివారం మధ్యాహ్నం వంట చేసే క్రమంలో నిప్పు రవ్వ రగడడం వల్ల అతని పూరిల్లు పూర్తిగా అగ్నికి దగ్ధమైంది.. రెక్కాడితే కాని డొక్కాడని సాంబయ్య రోడ్డున పడ్డాడు, ఇద్దరు కొడుకులు ఉన్న వారి పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉండడంతో సాంబయ్య ఏమి చేయాలో అయోమయ స్థితిలో ఉండగా,,! అఖండ ఫౌండేషన్ దృష్టికి తెలియగానే వారి కుటుంబానికి కొండంత భరోసానిచ్చింది. సోమవారం అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ రాసురి సాంబయ్య కు ధైర్యాన్ని చెప్పి నిత్యవసర సరుకులు, దుప్పట్లు, అలాగే 10,000 వేలు ఆర్థిక సహాయాన్ని అర్థం చేశారు.. అలాగే బాపట్ల మూర్తి నగరం లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కోటేశ్వరమ్మ కు 5000 ఆర్థిక ఆర్థిక సహాయాన్ని అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ ఆదేశాల మేరకు సభ్యులు కోటేశ్వరమ్మకు ఆర్థిక సాయం అందజేశారు.. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ; కష్టంలో ఉన్న వారి కోసమే ఫౌండేషన్ స్థాపించామని నియోజకవర్గంలో పేదవారికి అండగా ఉంటామని, సాంబయ్య గృహం మంటల్లో కాలిపోవడం చాలా బాధాకరంగా ఉందని ఆ కుటుంబాన్ని మరికొంతమంది చేయూతనిచ్చి ఆదుకోవాలని అన్నారు. అఖండ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు జివిఎల్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ: సాంబయ్య గృహం కాలిపోవడం చాలా బాధాకరమైన విషయమని వారి కుటుంబాన్ని స్వచ్ఛంద సంస్థలు సహృదయం కలిగిన దాతలు ఆదుకోవాలని అన్నారు.. విషయం తెలిసిన వెంటనే ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ వారి కుటుంబాన్ని కావలసిన నిత్యవసర వస్తువులు ఆర్థిక సాయం చేయడం చాలా గొప్ప విషయం అని అన్నారు. సభ్యుల సయ సహకారాలతో నియోజకవర్గంలో ఉన్న పేదవారి చెంతకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖండ ఫౌండేషన్ సభ్యులు, గొర్ల ఆంజనేయులు, చేజర్ల సతీష్, ఆసోది పోతురాజు రెడ్డి, డి బాల కోటేశ్వరరావు, డి సుభాష్, కే రాము, తదితరులు పాల్గొన్నారు…