Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారి వై. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారి వై. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

Listen to this article

పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 17:- రిపోర్టర్ (కే శివకృష్ణ)

2025 అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని రోటరీ కల్యాణమండపం ఎదురు ఉన్న భావన టవర్స్ లో అగ్నిప్రమాదాలపై గృహిణిలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ….. ప్రమాదాలు జరిగే సమయంలో అప్రమత్తంగా ఉంటే నివారించుకోవచ్చన్నారు. గ్యాస్ సిలెండర్ నుంచి గ్యాస్ లీకై మంటలు వ్యాపిస్తే నివారించుకునే విధానాన్ని ప్రదర్శన ద్వారా చూపించారు. అగ్నిప్రమాదాలు జరిగితే 101కు సమాచారమివ్వాలన్నారు. ఈ కార్యక్రమం లో ఎస్సై షైక్ అబ్దుల్ మునాఫ్,సిబ్బంది గోవర్ధన్ రావు, నాగయ్య, శ్రీనివాస రావు, గోపి కృష్ణ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments