
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్
ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న అంజయ్య
ఓం స్వామియే శరణమయ్యప్ప భక్త జనుల శరణు ఘోషతో మారుమ్రోగిన క్షేత్రం
( పయనించే సూర్యుడు మార్చి 22 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ఈ ప్రాంతంలో అయ్యప్ప స్వామి దేవాలయం అత్యద్భుతంగా నిర్మించడం ఎంతో గొప్ప విషయమని భక్తుల విశేష కృషిని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ మనస్ఫూర్తిగా ప్రశంసించారు. కనివిని ఎరుగని రీతిలో నందిగామ మండల కేంద్రం సమీపంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయం విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. ధ్వజస్తం దాత గాంధీ నగర్ కాలనీ చెందిన మాజీ వార్డు సభ్యులు వేణుగోపాల్ కావడం విశేషం. ఈ సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్త సమాజం అంజయ్యను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఓం స్వామియే శరణమయ్యప్ప భక్త జనుల శరణు ఘోషతో పవిత్ర క్షేత్రం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో గురుస్వామి లక్ష్మయ్య, ఆలయ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, వెంకట్ రెడ్డి, శ్రవణ్ పట్వారీ, హరిజీవన్ స్వామి, సుదర్శన్ గౌడ్ స్వామి తదితరులు పాల్గొన్నారు..