పయనించే సూర్యుడు ,జనవరి 11 బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక తాళ్ల గోమ్మూరు పంచాయతీ తాళ్ల గుమ్మరు గ్రామం చెందిన అంగన్వాడీ టీచర్ కణితి కృష్ణవేణి ఈనెల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మాస్టర్స్ అద్లెటిక్స్ కాంపిటీషన్లో 100 మీటర్ లో మూడో స్థానం ,200 మీటర్స్ లో రెండో స్థానం, లాంగ్ జంప్ లో రెండో స్థానం, మరియు ఫోర్ ఐ 100 రిలే లో మూడవ బహుమతులు సాధించడం జరిగినది, ఈ సందర్భంగా బిజెపి నాయకులు అంగన్వాడి టీచర్ కణితి కృష్ణవేణి అభినందిస్తూ శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు కేసాగాని శ్రీనివాస్ గౌడ్,
బిజ్జం శ్రీనివాస్ రెడ్డి ,చుక్కపల్లి బాలాజీ ,దుప్పటి సురేష్, వెలిశెట్టి రామారావు, కోడెబోయిన రవి, తదితరులు పాల్గొన్నారు