
పయనించే సూర్యుడు న్యూస్ తాడిపత్రి నియోజకవర్గ రిపోర్ట్ కుళ్లాయప్ప :21 అనంతపురం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో జగనన్న కాలనీ ఆలమూరు వద్ద ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించడం జరిగిందిఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ నాగేంద్ర కుమార్ నగర కార్యదర్శి వి రామిరెడ్డి నగర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకట్ నారాయణ ముత్తుజా ఇర్ఫాన్,గోపాల్,ప్రకాష్ రెడ్డి,మసూద్ కక్కలపల్లి ఓబులేష్ బుల్లె రాజు జీవ వెంకటేష్ ఎన్ టి ఆర్ సీన,గఫూర్ ఎర్రి స్వామి లక్ష్మి నారాయణ లతీఫ్ తదితరులు పాల్గొన్నారుఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనంతపురం నగరము నారాయణపురం రాజీవ్ కాలనీ రుద్రంపేట ఇతర గ్రామాలకు సంబంధించి 24 వేలకు పైగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలముతో పాటు ఇళ్లను నిర్మించి ఇస్తామని గత ప్రభుత్వం ఆలమూరు ఉప్పరపల్లి కొడిమి కామారుపల్లి, కక్కలపల్లి తదితర గ్రామాలకు చెందిన భూములలో ఇళ్ళ స్థలాలను మంజూరు చేసి ఇల్ల నిర్మాణాన్ని వివిధ కంపెనీలకు చెందిన కాంట్రాక్టర్లకి అప్పజెప్పడం జరిగింది. నాసిరకంగా నిర్మించడమే కాకుండా సరియైన వసతులు లేకుండా నగరానికి దూరంగా ఉండడం వల్ల లబ్ధిదారులు ఇళ్లల్లోకి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. ఆలమూరు గ్రామం కి సమీపాన ఉన్న కొండ దగ్గర 7వేల ఇండ్ల స్థలాలను మంజూరు చేసి ఇప్పటివరకు వివిధ దశలలో ఇళ్ల నిర్మాణం జరిగాయని 7 వేల ఇళ్ల ల్లో కేవలం 70 ఇళ్ళకు సంబంధించిన లబ్ధిదారులు మాత్రమే కాపురాలు చేస్తున్నారని మిగిలిన ఇల్లు అసంపూర్తిగా ఉండడం వల్ల లబ్ధిదారులు చేరడం లేదు. ఇందులో కూడా రెండు వేలకు పైగా ఇళ్ల స్థలాలలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఇళ్లకు మౌలిక సదుపాయాలు చాలా నామమాత్రంగానే ఉన్నాయి. ప్రధానంగా రోడ్ల సమస్య తాగునీటి సమస్య విద్యుత్తు ఇతర సదుపాయాలు సరిగా లేవు. విద్యుత్ స్తంభాలు సైతం విరిగిపోయి వాలిపోయిన స్తంభాలు కూడా ఉన్నాయి. ప్రజల సొమ్ము నీళ్ల పాలు అయినట్లు ఇక్కడ ప్రజాధనం అయినది ఇళ్లకు ఉపయోగించే ఇనుము సిమెంట్ పిల్లలు వృధాగా పడి చెడులు పడుతున్న పట్టించుకున్న వారు కనబడటం లేదు. లబ్ధిదారులు ఇల్లు పూర్తి అయిన తర్వాత 30 వేల రూపాయలు ఇస్తే తప్ప ఇళ్లను స్వాధీనం చేయలేదని లబ్ధిదారులు సిపిఎం నాయకుల దృష్టికి తీసుకువచ్చారని ఇళ్ల నిర్మాణం పూర్తి అయిన ఇళ్లను తక్షణం లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని సిపిఎం పార్టీ కోరుతున్నది. లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులను సమీకరించి ఇల్లు స్వాధీన కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ప్రజాశక్తి శీన పెరుగు గోపాలు శంకర్ గౌస్ ఇజ్రాయిల్ ఆది రామాంజి తదితరులు పాల్గొన్నారు