
పయనించే సూర్యుడు న్యూస్ :జనవరి 21 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి)… రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామత్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు,మెట్టుకూరు ధనుంజయ రెడ్డి సూచనల ప్రకారం, సోమశిల ఉత్తర కాలువ చైర్మన్ మెట్టుకూరు కృష్ణారెడ్డి మరియు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మునగపాటి సునీతమ్మ సహకారంతో,మండల తెలుగు యువత ఆధ్వర్యంలో 23 వ తేదీ ఉదయం 10 గంటలకు అనంతసాగరం మండల కేంద్రంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.కావున ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, తెలుగు యువత, తెలుగు మహిళ, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, నందమూరి మరియు నారా అభిమానులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నెల్లూరు పార్లమెంట్ తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి కమ్మ ప్రభాకర్ నాయుడు, మండల తెలుగుదేశం నాయకులు శాఖమూరి సుబ్బారావు, శంకర్ నగరం మాజీ సర్పంచ్ శాఖమూరి వెంకటేశ్వర్లు, కేతా శ్రీనివాసులు రెడ్డి, చల్లా శివారెడ్డి మరియు మండల తెలుగుయువత నాయకులు రాజశేఖర్,మెట్టుకురు మనోజ్,ప్రభాకర్,ఖాసీం బాషా, సావా కార్తీక్, మహేష్, ప్రదీప్ తదితరులు తెలిపారు