
పయనించే సూర్యుడు మార్చి 8 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
సుండుపల్లె మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఎటువంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి సమయంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది దీంతో గ్రామస్తులు, రెవెన్యూ అధికారులకు పోలీసు అధికారులకు పాత్రికేయులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లిన పాత్రికేయులపై తిరుమల జెసిపి యజమాని వెంకటేష్ దురుసుగా మాట్లాడడంతో శనివారం ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి పల్లం చందు మండల అధ్యక్షులు తిరుపాల్ నాయక్ ఆధ్వర్యంలో ఎస్సై ముత్యాల శ్రీనివాసులకు విలేకరులతో కలిసి ఫిర్యాదు చేశారు. విలేకరులపై దురుసుగా ప్రవర్తించిన జెసిపి ఓనర్ పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. వివరాలలోకి వెళితే శుక్రవారం అర్ధరాత్రి సమయంలో జెసిపి ట్రాక్టర్లతో మట్టిని ప్లాట్లు వేసే అందుకోసం ఇటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న వ్యక్తులను గ్రామ ప్రజలు అడ్డుకొని సంబంధిత అధికారులకు విలేకరులకు సమాచారం ఇవ్వడంతో న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన అరుణ్ కుమార్ నాయుడు, హరిబాబు, షేక్.యూసుఫ్ విలేకరులపై జెసిపి ఓనర్ వెంకటేష్ విలేకరులను బెదిరించి దుర్భాషలాడాడు విషయం పై ఎస్ఐకి తరణం స్టాఫ్ రిపోర్టర్ అరుణ్ నాయుడు ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ విషయంపై ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు స్పందిస్తూ గతంలో ఆ వ్యక్తి పై కేసు కూడా ఉందని చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు పాల్గొన్నారు.