Monday, October 20, 2025
Homeఆంధ్రప్రదేశ్అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా చర్యలు తప్పవు

అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా చర్యలు తప్పవు

Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 11,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నియమనిబంధనలు, జాగ్రత్తలు పాటించాలి.

నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం.

నంద్యాల సబ్ డివిజన్ ASP ఎం.జావళి IPS గారు

నంద్యాల సబ్ డివిజన్ నందు రానున్న దీపావళి సందర్భంగా బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలు, దుకాణాలలో తప్పనిసరిగా ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించాలని, ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించిన వారిపై ప్రేలుడు పదార్థాల చట్టం ప్రకారం చర్యలు తప్పవని నంద్యాల ASP గారు హెచ్చరించారు.ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు, సూచనలు పాటిస్తూ షాప్ లు ఏర్పాటు చేసుకొని టపాసులను విక్రయించాలని విక్రయదారులకు, సంబందిత అదికారులకు నంద్యాల ASP గారు ఆదేశించారు.దీపావళి పండుగ నేపథ్యంలో నంద్యాల ASP గారి ఆదేశాలతో ఫైర్ క్రాకర్స్ షాపు నిర్వహకులు ఎక్కువగా క్రాకర్స్ నిల్వలు ఉంచిన, వాటిపై ఫైర్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా.. లేదా.. అనే విషయమై పోలీసు అదికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడము జరుగుతుంది.నంద్యాల సబ్ డివిజన్ నందు దీపావళి టపాకాయలు విక్రయదారులు జనసంచారం ఉన్న ప్రదేశాలలో, ప్రజల నివాస ప్రాంతాలలో టపాకాయలు విక్రయించరాదని, ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే ప్రభుత్వ నిబందల ప్రకారం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి.బాణసంచా విక్రయదారులు చట్టం సూచించిన నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలి.నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.చిన్న పిల్లలను తపాకాల విక్రయాల పనుల్లో ఉంచుకోరాదన్నారు.ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తప్పనిసరిగా పాటించాలన్నారు.ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవలసిన చర్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.పోలీసు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎవరైనా అక్రమంగా టపాసులు విక్రయిస్తున్నా వెంటనే డయల్ 112 లేదా సంబంధిత పోలీసు స్టేషన్ కు సమాచారం చేరవేసిన వారి వివరాలు గోప్యంగా సమాచారం అందించాలని, ఉంచుతామని నంద్యాల సబ్ డివిజన్ ఏ ఎస్ పి ఎం.జావళి విజ్ఞప్తి చేశారు.సబ్ డివిజనల్ పోలీసు ఏ ఎస్ పికార్యలయం,నంద్యాల .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments