
పయనించే సూర్యుడు మే 10 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
2025 — 26 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగినది. సంవత్సరానికి ఒక రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 14,000 కేంద్ర ప్రభుత్వం 6,000 చొప్పున మొత్తం 20,000 రూపాయలు సాగు ఖర్చుల కొరకు జమ చేయడం జరుగుతుంది. ప్రతి రైతు సేవ కేంద్రంలో దీనికి సంబంధించిన డేటా వెరిఫికేషన్ 20.5.25 వరకు ఆన్లైన్లో అన్నదాత సుఖీభవ పోర్టల్ లో రైతు సేవ కేంద్రం సహాయకులు నమోదు చేయడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ స్కీము నందు ఒక సంస్థకు సంబంధించిన భూములు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు జిల్లా పరిషత్ చైర్మన్ ,మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీస్ మొదలైన . ఉద్యోగస్తులు ,రిటైర్ అయిన ఉద్యోగస్తులు, పదివేలపైన పెన్షన్ తీసుకునేవారు 4 వ తరగతి ఉద్యోగస్తులు తప్ప ఆదాయపన్ను చెల్లించువారు, రిజిస్టర్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఆర్కిటెక్స్. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ హౌస్ సైట్స్ .కన్వర్ట్ అయిన రైతుల భూములు ఒకవేళ రెవెన్యూ రికార్డులో అప్డేట్ అయినా. కాకపోయినా ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కు అనర్హులు. వ్యవసాయ,ఉద్యాన, సెరికల్చర్ లో సాగు భూమి వున్న ప్రతి రైతు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు అవుతారు. అగ్రో ఫారెస్ట్రీ .సరుగుడు, జమాయిల్,ఎర్ర చందనం పెంపకం .ఉన్న పొలాలు అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులు అవుతారు. ఈ డేటా వెరిఫికేషన్ అనేది గ్రామస్థాయిలో వ్యవసాయ మరియు రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ డేటా వెరిఫికేషన్ తర్వాత ఆర్ టి జి ఎస్ .పోర్టల్ లో డేటా రీ వాల్యు డేట్ అవుతుంది. ఫైనల్ లిస్ట్ మరల గ్రామస్థాయి రైతు సేవా కేంద్రం సహాయకులకు వస్తుంది . ఫేషియల్ ఈ -కేవైసీ ద్వారా ఆయా రైతులను మరలా నమోదు చేసినట్లయితే చివరకు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులవుతారు. కావున ప్రతి రైతు తమ తమ ఆధార్ మరియు భూమి వివరాలతో మీ పరిధిలోని రైతు సేవ కేంద్రం సహాయకులను కలిసి వివరాలను పరిశీలించుకోవాలని చేజర్ల మండల వ్యవసాయ అధికారి శశిధర్ శుక్రవారం తెలిపారు