
కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్
పయనించే సూర్యుడు ప్రతినిధి, (శ్రీరామ్ నవీన్) తొర్రూరు డివిజన్ కేంద్రం
అన్నదానం పేదల ఆకలి తీర్చే స్ఫూర్తి మంత్రం అని కాంగ్రెస్ పార్టీ తొర్రూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక జయశంకర్ సర్కిల్ లో మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతీ మంగళవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి పలువురికి అన్నం వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, ఒక్కో మెతుకు.. బతుకును కోరుతుందని అన్నారు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం గొప్ప కార్యం అని కొనియాడారు. ప్రతీ ఒక్కరూ నిరుపేదలకు తమవంతు సహాయం అందించాలని, పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవాల సందర్భంగా మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ చేపడుతున్న అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని క్షుద్బాదతో ఉన్నవారికి అహారం అందజేసి మానవత్వం చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఫౌండర్ సిరికొండ విక్రమ్ కుమార్, సంస్థ ప్రతినిధులు రాజేష్, చరణ్, రాజు, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.