-రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీ.సీ.ఏం ఎస్ చైర్మన్ కొత్వాల
పయనించే సూర్యుడు జనవరి 21( పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి) పాల్వంచ టౌన్: తెలంగాణా రాష్ట్రంలోని అన్నీ వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా సాగి స్తున్నదని రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, డీ.సీ.ఏం.ఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26 తేదీ నుండి అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక కోసం వార్డు సభలు చేపట్టడం జరిగింది. మొదటిరోజు మంగళవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 1 వార్డు గడియకట్ట, 2 వార్డు పాత పాల్వంచ, 3 వార్డు నవభారత్, 4 వార్డు సీతారాంపట్నం, 5 వార్డు సబ్ స్టేషన్ ఏరియా, 6 వార్డు వడ్డుగూడెం ప్రాంతాల్లో జరిగిన వార్డు సభల్లో కొత్వాల పాల్గొన్నారు. ఈ సందర్భం గా కొత్వాల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా ఆరు గ్యారంటీలను ప్రకటించిందని, వాటిలో ఒకే దఫా రెండు లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విధ్యుత్ వంటి పథకాలను నిర్విఘ్నంగా అమలు చేస్తున్నదన్నారు. ఇటీవల రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆదరించాలని కొత్వాల కోరారు. కోత్వాల ను సన్మానించిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు వార్డు సభల సందర్భంగా ఆయా ప్రాంతాల మహిళలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కొత్వాల ను సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమీషనర్ కే సుజాత, మేనేజర్ ఎల్. వీ సత్యనారాయణ, డీ. ఈ స్వరూపా రాణి, ఏ. ఈ రాము, టీ.పీ. ఓ నవీన్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, కాంగ్రెస్ ఎస్.వీ. ఆర్. కే ఆచార్యులు, కందుకూరి రాము, దారా చిరంజీవి, చింతా నాగరాజు, వాసుమల్ల సుందర్ రావు, డిష్ నాగేశ్వరరావు, అజిత్, వజ్జల రాము, మాలోత్ కోటి నాయక్, బీ బాలు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
అన్నీ వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
RELATED ARTICLES