
పయనించే నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో — బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు
వేల్పూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెండోరా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యంరెడ్డి,బాల్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగా ప్రసాద్ ,మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యంరెడ్డి, ఏర్గట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోమ దేవా రెడ్డి, మోర్తాడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాములు అందరూ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మెండోరా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యంరెడ్డి మాట్లాడుతూ ఇటీవల బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ మండలంలో నడ్కుడ గ్రామంలో గల్ఫ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు ఎక్స్గ్రేషియా ఇస్తామని ఇవ్వడం లేదు అని అబద్ధపు మాట్లాడటం మాటలు మాట్లాడడం జరిగిందని, కానీ ప్రశాంత్ రెడ్డి మాటలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు ఎక్స్గ్రేషియా ఇస్తుందని అందులో బాల్కొండ నియోజకవర్గంలో 18 మందికి, నిజామాబాద్ జిల్లాలో 55 మందికి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది అని ఆయన తెలిపారు. ప్రశాంత్ రెడ్డి మాటలకు స్పందిస్తూ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ చేయడం జరిగిందని దానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని ఈ నెల 17వ తేదీన ప్రశాంత్ రెడ్డి సొంత ఇంటికి గల్ఫ్ బాధిత కుటుంబాలు తీసుకొని వెళ్లి వాస్తవాలను ప్రశాంత్ రెడ్డికి తెలిసే విధంగా చూపిస్తామని త్యం రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి మాట్లాడుతూ గల్ఫ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన ప్రశాంత్ రెడ్డి శవ రాజకీయాలు చేశారని ప్రభుత్వంపై అబద్ధపు మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు ఎక్స్గ్రేషియా అందిస్తుంటే ఇవ్వడం లేదు అని చెప్పడం చూస్తుంటే ఆయనకు గల్ఫ్ బాధిత కుటుంబాల పట్ల పూర్తిగా అవగాహన గాని సమాచారం గాని లేదు అని తెలుస్తుంది అని ,గతంలో మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి ఆయన విలువను తక్కువ చేసుకునే విధంగా మాటలు మాట్లాడుతున్నాడని, ఏదైనా విషయంపై మాట్లాడే ముందు పూర్తి సమాచారం తెలుసుకొని మాట్లాడాలని నర్సారెడ్డి తెలిపారు. ఈనెల 17వ తేదీన బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికే 18 మందికి ఎక్స్గ్రేషియా చెల్లించిన కుటుంబాలను తీసుకువచ్చి వేల్పూర్ మండలం గాంధీ విగ్రహం వద్ద పరిచయవేదిక ఏర్పాటు చేసి ప్రశాంత్ రెడ్డికి ఎక్స్గ్రేషియా తీసుకున్న కుటుంబాలను పరిచయం చేస్తామని ప్రశాంత్ రెడ్డి 17వ తేదీన వేల్పూర్ మండలం గాంధీ విగ్రహం దగ్గరికి రావాలని నర్సారెడ్డి సవాల్ చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగప్రసాద్ మాట్లాడుతూ గల్ఫ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రశాంత్ రెడ్డి ని విమర్శించే స్థాయి మాకు లేదు అని కొందరు అనుకోవచ్చు కానీ ప్రశాంత్ రెడ్డి దిగజారిపోయి మాట్లాడుతుంటే కాంగ్రెస్ కార్యకర్తగా ప్రశాంత్ రెడ్డిని విమర్శించే స్థాయి మాకు ఉంది అని, గతంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా గల్ఫ్ బాధితుల గురించి పట్టించుకోలేదని, కేవలం వారిని ఓట్ల కొరకు మాత్రమే వాడుకుంది అని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గల్ఫ్ కుటుంబాలను ఆదుకోవాలని ఏదైనా కారణాలవల్ల గల్ఫ్ లో చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా చెల్లించే కార్యక్రమాన్ని తీసుకుంది అని ఆయన అన్నారు రేవంత్ రెడ్డి ని తక్కువ చేసే విధంగా ప్రజలకు అబద్ధపు మాటలు చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా కేసీఆర్ ఆడుతున్న నాటకంలో భాగంగానే ప్రశాంత్ రెడ్డి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడని, రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం అండగా నిలుస్తుంటే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణనీ చూసి ఓర్వలేక ఇలాంటి అబద్ధపు మాటలు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని,ప్రశాంత్ రెడ్డి మాటలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మీకు సవాల్ చేయడం జరిగింది అని, ఆ సవాలు మీరు స్వీకరించి ఈనెల 17వ తేదీన వేల్పూర్ మండలానికి రావాలని అన్నారు. ప్రశాంత్ రెడ్డి గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రావడం లేదు అని ఏ విధంగా మాట్లాడాడో ఆ విషయం అబద్ధము అని ఆయనకు ప్రజలకు తెలియజేయడానికి ఈ నెల 17వ తేదీన వేల్పూర్ మండల కేంద్రంలో గర్ల్స్ బాధిత కుటుంబాలతో పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఈ వేదికగా బాల్కొండ నియోజకవర్గంలో ఏవైతే 18 కుటుంబాలు ప్రభుత్వం నుండి గల్ఫ్ బాధిత ఎక్స్గ్రేషియా పొందాయో వారిని తీసుకువచ్చి ప్రశాంత్ రెడ్డి చెప్పిన మాటలు అబద్ధము అని ప్రశాంత్ రెడ్డికి పరిచయం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ప్రయత్నం చేస్తున్నామని, కావున ఈనెల 17వ తేదీన ప్రశాంత్ రెడ్డి తన సొంత మండలమైన వేల్పూర్ మండల కేంద్రానికి వచ్చి వాస్తవాలను తెలుసుకోవాలని గంగ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో దామోదర్ గౌడ్ ,రమణ, భగవాన్ దాస్ భూమారెడ్డి,శ్రీధర్, రాము,మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
