

పయనించే సూర్యుడు అక్టోబర్ 21 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న : నంద్యాల జిల్లాలో అమరవీరుల సంస్కరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ మరియు ఎస్పీ రావడం జరిగింది. నంద్యాల జిల్లాలో అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ,విధి నిర్వహణలో ప్రాణాలను తృణప్రాయంగా భావించి ప్రజల శ్రేయస్సుకై ప్రాణాత్యాగం చేసిన పోలీసుల సేవలు మరువలేము.
దేశరక్షణలో సైనికులు, ప్రజాస్వామ్య శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు అభినందనీయం. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు.