
బీఆర్‌ఎస్ రజతోత్సవాల కోసం వెళ్తున్న యువ నాయకుడు
శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా వీడుకోలు
( పయనించే సూర్యుడు మే 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
అమెరికాలోని డల్లాస్ నగరంలోనూ బీఆర్‌ఎస్ రజతోత్సవాలను నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది పాటు రజతోత్సవాలను జరపాలని నిర్ణయించిన విషయం విదితమే..! అందులో భాగంగానే డల్లాస్ నగరంలో రజతోత్సవాల కార్యక్రమం కోసం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ తనయుడు వై రవీందర్ యాదవ్ బుధవారం డల్లాస్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నుండి పలువురు నాయకులు రవీందర్ యాదవ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు. డల్లాస్‌లోని పెప్పర్‌అరేనాలో జూన్ 1న చేపట్టే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ తెలిపారు. అమెరికాతో పాటు.. వివిధ దేశాల్లోనూ ఏడాదిపాటు పార్టీ రజతోత్సవాలను నిర్వహిస్తుందని ఈ సందర్భంగా చెప్పారు.
