Thursday, April 3, 2025
Homeతెలంగాణఅమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్‌కు తీసుకొస్తాం: భారత ప్రధాని మోదీ సంచలన ప్రకటన

అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్‌కు తీసుకొస్తాం: భారత ప్రధాని మోదీ సంచలన ప్రకటన

Listen to this article

మరో రెండు విమానాల్లో ఫిబ్రవరి 15న భారత్ కు రాక

170-180 వలసదారులు ఉంటారని సమాచారం

చట్టవిరుద్ధంగా ప్రవేశించే హక్కు లేదన్న భారత ప్రధాని వాషింగ్టన్

పయనించే సూర్యుడు స్టేట్ ఇంచార్జ్ అనిల్ కుమార్ :ఫిబ్రవరి 15 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ విడతగా విమానంలో కొందరు భారతీయుల్ని స్వదేశానికి తిప్పి పంపారు. దాంతో అమెరికా మన పౌరుల్ని బలవంతంగా భారత్‌కు పంపిస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. కానీ అమెరికా పర్యటనలో మోదీ సంచలన ప్రకటన చేశారు. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న దేశ పౌరులను భారత్‌కు తిరిగి తీసుకొస్తామని నరేంద్ర మోదీ ప్రకటించారు.ఓ దేశంలో చట్ట విరుద్ధంగా ప్రవేశించిన వారికి, అక్కడ నివసించే హక్కు ఉండదన్నారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. అక్రమ వలసల్ని ఏ దేశం సహించదని, ప్రపంచమంతా ఇది వర్తిస్తుందన్నారు. అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం చూపుతారని భావించిన వారికి ప్రధాని మోదీ బిగ్ షాకిచ్చారు. మరోవైపు అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు, చదువుపూర్తయిన వారు రెస్టారెంట్లలో, బార్లలో, పెట్రోల్ బంకుల్లో కనుక కనిపిస్తే వారి వివరాలు ఆరా తీస్తుండటంతో భయాందోళన నెలకొంది. ఇటీవల పంజాబ్ యువకుడు డంకీ మార్గంలో అమెరికాకు వెళ్తూ మార్గం మధ్యలో చనిపోవడం కలకలం రేపింది. మరో రెండు విమానాలలో భారత్‌కు. అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపింది. ఇదివరకే పలు దేశాలకు చెందిన వారిని విమానాలలో వారి స్వదేశాలకు పంపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన డిపోర్టేషన్‌ ప్రక్రియలో భాగంగా 104 మంది ఇండియన్స్‌ను సైతం తిప్పి పంపింది. ఫిబ్రవరి 5న విమానంలో వారు భారత్ కు చేరుకున్నారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగానూ మరో రెండు విమానాలలో కొందరు భారతీయులను స్వదేశానికి పంపిస్తున్నారు. ఇదివరకే ఓ విమానం బయలుదేరగా ఫిబ్రవరి 15న భారత్ చేరనున్న విమానంలో 170 నుంచి 180 మంది ఉంటారని సమాచారం. మరో విమానంలోనూ మరికొందర్ని భారత్‌కు తరలించేందుకు అమెరికా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments