
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 8 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్:ఫిబ్రవరి 08
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరానికి భక్తులు పోటెత్తారు. ఓ వైపు ప్రయా గ్‌రాజ్‌లో కుంభమేళాకు వచ్చే కోట్లాది మంది భక్తుల రాకతో కిక్కిరి సిపోయింది. ఇంకోవైపు రాముడి దర్శనం కోసం అయోధ్యకు పోటెత్తారు. ఇలా భక్తుల రాకతో తీవ్ర రద్దీ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాల రాముడి ఆలయ దర్శనం వేళల్లో స్వల్ప మార్పు చేసింది. ఇకపై ఉదయం ఆరు గంటల నుంచే భక్తులకు బాల రాముడి దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు.
ప్రస్తుతం ఉదయం ఎడు గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తుండగా.. దీన్ని గంట ముందుకు జరపడం ద్వారా ఇక నుంచి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులను అనుమతిం చనున్నారు.
ఇకపై ప్రతిరోజూ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు ఆలయం తెరిచి ఉంటుం దని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఉదయం నాలుగు గంటలకు ‘మంగళ ఆరతి’ జరుగు తుంది. ఆ తర్వాత ఆలయ తలుపులు కొద్దిసేపు మూసివేయబడతాయి
ఉదయం ఆరు గంటలకు ‘శృంగర్ ఆరతి’ జరుగు తుంది. ఇది ఆలయం ప్రజల కోసం తెరవబడ టానికి గుర్తుగా ఉంటుంది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు ‘‘రాజ్‌భోగ్’ నైవేద్యం సమర్పించబడుతుందని.. ఆ సమయంలో భక్తులకు దర్శనం అనుమతిస్తామని ఆలయ ట్రస్ట్ తెలిపింది.
సాయంత్రం ఎడు గంటలకు ‘సంధ్యా ఆరతి’ నిర్వహించ నున్నారు. ఆ సమయంలో ఆలయ తలుపులు పది హేను నిమిషాలు మూసివేయబడి తిరిగి తెరవబడతాయి. ‘శాయన ఆరతి’ రాత్రి తొమ్మిది గంటల ముప్పై బదులుగా రాత్రి పది గంటలకు నిర్వహించ బడుతుంది. ఆ తర్వాత రాత్రికి ఆలయం మూసివేయబడుతుంది.