▪వీణవంక మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు.. శీలం సురేందర్ రెడ్డి..
పయనించే సూర్యడు //జనవరి //23//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్..
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా నిర్వహిస్తున్న గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని వీణవంక మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శీలం సురేందర్ రెడ్డి అన్నారు. మండలం లోని గంగారం, కొండపాక, బేతగల్, శ్రీరాములపేట, చల్లూర్, కిష్టంపేట, దేశయిపల్లి, ఘన్ముక్ల ఈ గ్రామాలలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆహార భద్రత కార్డులతో పాటు తదితర సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఇందులో ఎలాంటి పైరవీలకు తావు లేదని అన్నారు. గత ప్రభుత్వం పేదలకు ఒక్క ఇళ్ళు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. అదేవిదంగా రేషన్ కార్డులనుకూడా గత ప్రభుత్వం ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని, కాంగ్రెస ప్రభుత్వం పేదల కోసం పని చేసే ప్రభుత్వం అని అన్నారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కి కృషి చేయాలన్నారు.
అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..
RELATED ARTICLES