
పయనించే సూర్యుడు న్యూస్(జూలై.4/07/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
అర్హులైన ఆర్టీసీ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలని తిరుపతి జిల్లా సత్యవేడు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిపో సెక్రటరీ మధుబాబు కోరారు.శుక్రవారం ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక ఆర్టీసీ గ్యారేజ్ వద్ద పలువురు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి మధుబాబు మాట్లాడుతూ పదోన్నతులకు సంబంధించి ముఖ్యమంత్రి వద్ద పెండింగ్లో ఉన్న ఫైల్కు క్లియరెన్స్ ఇచ్చి అర్హులైన ఉద్యోగులు 3000 మందికి న్యాయం చేయాలన్నారు.పైగా అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగుల కొరత ఉన్న నేపథ్యంలో కొత్తగా నియామకాలు చేపట్టాలని ఆయన కోరారు. జిల్లా సహాయ కార్యదర్శి మహేశ్వర మాట్లాడుతూ
ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి చెల్లించవలసిన డిఎ పిఆర్సి బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.12వ పిఆర్సికి సంబంధించి వెంటనే కమిషన్ వెసి ఐఆర్ప్రకటించాలన్నారు.మహిళలు ఉచిత బస్సు పథకం విజయవంతంగా కొనసాగాలంటే కొత్తగా 2500 బస్సులు కొనుగోలు చేసి అందుకు తగ్గట్టు సిబ్బంది కొరతను తీర్చాలన్నారు.ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షులు మనోహర్,వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య,ఉన్నత సలహాదారి వెంకటయ్య,గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులు శ్మునస్వామి,రాజా,కోశాధికారి కార్తీక్,డిపో నాయకులు గోవర్ధన్,శేఖర్,శేఖర్,వెంకటయ్య,.శ్రీనివాసులు,శంకర్, సరిత పాల్గొన్నారు