
———–అభివృద్దే లక్ష్యంగా – అధికారులు పని చేయండి
———–ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి
———-గోరంట్ల మండలంలోని అభివృద్ధి పనులు ,ప్రభుత్వ పథకాలపై చర్చ నిర్వహించిన మంత్రి సవితమ్మ .
పయనించే సూర్యుడు జనవరి 21 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం… ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంలో ప్రజల అంచనాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని మంత్రి సవిత అన్నారు.ప్రభుత్వ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని కే ఎన్ బి కన్వెన్షన్ హాల్ నందు గోరంట్ల మండలం ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ .ఈసందర్భంగా అన్ని శాఖల అధికారులతో రివ్వు నిర్వహిస్తూ ముఖ్యంగా ప్రజలకు త్రాగునీరు, రైతులకు సాగునీరు ,విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి అని అధికారులను ఆదేశించారు.మండలం కు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉండకూడదని డ్రైనేజ్ కాలువలు ,వాటర్ ట్యాంకులు ,ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండాలని తెలియచేసారు.ప్రజల సమస్యల కోసమే అధికారులు ఉన్నారు.అధికారులే సమస్య గా మారితే ఉపేక్షించేది లేదని మంత్రి తెలిపారు. వైద్యాధికారులు మరియు సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని ఎక్కడ కూడా అలసత్వం లేకుండా చురుకుగా ఉంటూ సీజనల్ గా వచ్చే వ్యాధుల బారిన పడకుండా చూడాలని ఆదేశించారు.గ్రామాల్లో మంచి నీరు,విద్యుత్, శానిటేషన్ విషయాలలో అధికారులు ప్రజా ప్రతినిధులు నిత్యం పర్యవేక్షించాలి. ప్రతి లబ్ధిదారునికి రేషన్ అందాలి ,రేషన్ ఇవ్వలేదు అనే ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదు.ముఖ్యంగా గోరంట్ల మండలం లో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఇప్పటికే ప్రణాళికలు వేయాలని అధికారులను ఆదేశించారు.సమస్యలతో కార్యాలయంకు వచ్చే ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పుకోకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.సచివాలయ ఉద్యోగులు విధుల పట్ల ప్రజల సమస్యల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు ,గ్రామ సచివాలయ అధికారులు ,కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….