
జనం న్యూస్ అక్టోబర్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్‌లో డాక్టర్ గార్డ్ వాటర్ ప్రూఫింగ్ కార్యాలయాన్ని నేడు బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, స్కూల్ రోజుల నుంచే స్నేహితులుగా ఉన్న తొమ్మిది మంది యువకులు తక్కువ మూలధనంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించడాన్ని అభినందించారు. నాలుగు నెలల వ్యవధిలోనే 30 మందికి పైగా ఉపాధి కల్పించడం గర్వకారణమని, రాబోయే రెండేళ్లలో వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యం ప్రశంసనీయమని అన్నారు. యువత కొత్త ఆలోచనలతో వ్యాపారం ప్రారంభించడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఇమ్రోజ్ మరియు ఆయన స్నేహితులు పెద్ద కలలు కనడం స్ఫూర్తిదాయకమని కేటీఆర్ అభివర్ణించారు.ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయం తరఫున సంస్థకు వర్క్ ఆర్డర్‌ను అందజేశారు.
