
గిరిజనుల ఆవేదన వ్యక్తం చేస్తున్న యువనేత ఆకాష్ నాయక్
ట్రైబల్స్‌పై చేసిన వ్యాఖ్యలపై చర్యలు ఎందుకు లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గిరిజన సంఘాలు
( పయనించే సూర్యుడు జూలై 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
గిరిజనుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయినా ఇప్పటికీ అతడిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడాన్ని గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ మేరకు గిరిజన యువ నేత ఆకాష్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ…సినీ నటుడు అల్లు అర్జున్‌కి ఒక న్యాయం, విజయ్ దేవరకొండకి ఇంకొక న్యాయమా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ట్రైబల్ కమ్యూనిటీని పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చిన వ్యక్తిని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం దారుణం. కేవలం నామమాత్రంగా కేసు నమోదు చేసి ఊరుకున్న ప్రభుత్వం ఏ సంకేతాలు ఇస్తోంది? అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.విజయ్ దేవరకొండను తక్షణమే అరెస్ట్ చేసి, గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను గిరిజన యువ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.బాధిత గిరిజన సమాజానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు సంతోష్ నాయక్, ఆకాష్ చౌవన్,ప్రకాష్ నాయక్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.
