
విప్లవకారుడు పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు
ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ
పయనించే సూర్యుడు బాపట్ల మే:- 8 రిపోర్టర్ (కే శివకృష్ణ )
బాపట్ల సూర్యలంక రోడ్డు విజయలక్ష్మిపురం అడ్డరోడ్డు వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు 128వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మాట్లాడుతూ….నాడు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లోకి దూసుకెళ్లిన విప్లవబాణం మన జనబాణం స్వతంత్ర సమరయోధుడు మన విప్లవరుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు.అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయసులోనే స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారన్నారు. ఆ వీరుడు మరణించి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ.. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పారు.ఈ కార్యక్రమం లో బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు,జనసేన నియోజకవర్గ సమన్వయకర్త నామన శివన్నారాయణ,మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్షులు గోలపల శ్రీనివాసరావు,గుంటూరు డివిజన్ రైల్వే బోర్డు మెంబెర్ పఠాన్ రాజేష్,పల్లం సరోజినీ,ఆనంద్ ఘజపతి రాజు, భాస్కర్ రాజు, నాగరాజు, రామ్ మూర్తి రాజు, శేషు, షైక్ చాన్, హనుమంత్ రావు, శేషు కృష్ణ, బొట్టు కృష్ణ, దర్మేంద్ర,ఇమ్మడిశెట్టి శ్రీనివాస రావు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.