
ఆదివాసి సంక్షేమ పరిషత్ నిరసన ఐటిడిఏ పిఓ కు వినతి.
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ నవంబర్ 3 సోమవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16) ఆధ్వర్యంలో రంపచోడవరం ఐటిడి ఎదుట నిరసన చేసి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసులకు ఉన్న ఏకైక ఏజెన్సీ జిల్లా అని అటువంటి జిల్లాని ముక్కలు చేసి రంపచోడవరం నియోజకవర్గం రాజమండ్రిలో కలిపే కుట్రలు చేస్తే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు. ప్రతి ఆదివాసి కూడా పాలకుల కుట్రలను పసిగట్టి అల్లూరి సీతారామరాజు జిల్లా కాపాడుకోవడానికి చేసే ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.వైరామవరం గ్రామానికి చెందిన ఓ ఆదివాసి మహిళ నాన్ ట్రైబల్ అక్రమ కట్టడాలపై ఎల్ టి ఆర్ కేసులు పెడుతున్నందుకు, ఆదివాసులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించినందుకు వైరామవరం మండలం తాసిల్దార్ మరియు ఎస్సై అలాగే నాన్ ట్రైబల్స్ కలిసి కక్ష పూరితంగా కొంతమంది మహిళలను రెచ్చగొట్టి దాడి చేయిస్తున్నారని. గతంలో ఆదివాసి మహిళపై అత్యాయత్నం కూడా జరిగిందని దీనిపై కఠినంగా వ్యవహరించి వైరామవరం మండలం ఎమ్మార్వో పై ఎస్సై పై మరియు నాన్ ట్రైబల్స్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివాసి హక్కుల గురించి మాట్లాడినందుకు ఒక ఆదివాసి మహిళపై ఇంత కక్షపూరితమైనటువంటి చర్యలకు దిగజారటం ఇది వారి స్థాయికి తగినది కాదని, దాడులు చేసిన వారిపై దాడులు చేయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆదివాసీ మహిళలకు అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా 1/70 ఎల్ టి ఆర్ చట్టం ఏజెన్సీలో పూర్తిగా నిర్వీర్యం అవుతుందని, చట్టాల అమలు చేయడంలో అధికారులు విఫలం అవటం వలన ఆదివాసి భూములు సైతం నాన్ ట్రైబల్స్ కబ్జాలు చేసి చట్టానికి విరుద్ధంగా పట్టాలు చేయించుకుంటున్నారని అదేవిధంగా ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేసి వ్యాపార వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్నారని కావున ఏజెన్సీ ప్రాంతాల్లో భూ ఆక్రమణలను నిషేధించాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్రమ కట్టడాలను గుర్తించినప్పటికీ వాటిని తొలగించడం లేదని దీని వెనక అధికారులకు భారీ ఎత్తున ముడుపులు అందుతున్నాయని ఆయన మండిపడ్డారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా కామిశెట్టి వీరబాబు తండ్రి సత్యనారాయణ అనే నాన్ ట్రైబల్ నిర్మించిన అక్రమ కట్టడంపై ఎల్ టి ఆర్ కేసు నమోదు చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని. కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు, డివిజన్ అధ్యక్షులు మోడిద నూకరాజు, డివిజన్ ప్రధాన కార్యదర్శి చోడి ప్రదీప్ కుమార్ దొర, నాయకులు పీటా ప్రసాద్, కారు అరుణకుమారి, కంగాల అబ్బాయి దొర, శివ, జోగిరాజు , వీరభద్రరావు, శారదా దేవి తదితరులు పాల్గొన్నారు.
