Tuesday, May 20, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ తెలంగాణను వణికించేందుకు భారీ కుట్ర

ఆంధ్రప్రదేశ్ తెలంగాణను వణికించేందుకు భారీ కుట్ర

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ మే 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ లో భారీ పేలులకు ఐసిస్ కుట్ర చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి, ఎన్ఐఏ తెలంగాణ ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ కుట్రను భగ్నం చేసినట్లు తెలిసింది, ఏపీలోని విజయనగరంలో తీగ లాగితే హైదరాబాదులో డొంక కదులుతుందని సమాచారం.దేశవ్యాప్తంగా శాంతి భద్రతలకు పతనం కలిగించేందుకు కుట్రలు నడుస్తున్న దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,ను వనికించేం దుకు భారీ కుట్ర జరుగు తుందని తెలుస్తుంది, వీటితోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పేలుళ్ల కోసం వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్న గ్రూపును భద్రతా సంస్థలు అదుపు లోకి తీసుకుంటున్నాయి ఇందులో ఆరుగురు సభ్యు లతో కూడిన తీవ్రవాద సంస్థ అల్-హింద్ ఇత్తేహ దుల్ ముసల్మాన్, కీలక పాత్ర పోషిస్తోంది.విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ జీవితం ఒక సాధారణ యువకుడి ప్రయాణంలా మొదలైంది. 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఎస్‌ఐ, గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమవుతూ హైదరాబాదు లో శిక్షణ తీసుకున్నాడు. కానీ ఎస్ఐ సెలక్షన్‌లో విఫ లం కావడం, గ్రూప్-1లో స్థిరపడలేకపోవడం అతని మనస్తత్వాన్ని మార్చేసి నట్లు అనిపిస్తోంది.ఆ మధ్యకాలంలో 108 అంబులెన్స్ సర్వీసులో టెలికాలర్‌గా పని చేస్తూ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది – అదే అతని జీవితాన్ని ఎడారిలోకి నెట్టిన మొదటి అడుగు అయ్యింది.సమీర్ ద్వారా వరంగల్‌కు చెందిన పరహాన్ మొయిన్, యూపీకి చెందిన బాదర్ వంటి మిగతా తీవ్రవాదు లతో పరిచయమయ్యాడు. సమాజంలో ముస్లింలపై జరుగుతున్న అన్యాయాల పేరుతో చర్చలు, ఆగ్రహం, చివరికి తీవ్రవాద మార్గం వైపు మలుపు తీసుకున్న ఈ గ్రూపు ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో గోప్యంగా సమావేశాలు నిర్వహిం చాయి.ఒమన్‌ లోని హైదరాబాదు వాసి ఇమ్రాన్ అక్రమ్ మార్గదర్శకత్వంలో పేలుడు పదార్థాల కొనుగోలు, వాటిని ఉపయోగించి ఐ ఈ డి బాంబులు తయారు చేయడం మొదలైంది. ఈ బాంబులను జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పేల్చాలని, ముందు డమ్మీ బ్లాస్ట్ నిర్వహించాలని కూడా ప్రణాళిక రూపొందించారు.ఈ కుట్రకు సాంకేతిక ప్లాట్‌ఫార్ములు కూడా నిలయాలుగా మారాయి. సిగ్నల్ వంటి షాడో కమ్యూ నికేషన్ యాప్‌లలో తరచూ మాట్లాడుతూ, అబూ ము సబ్ అనే విదేశీ మూడ్‌గాడ్ సూచనలతో ముందుకెళ్లా రు.జిహాదీ చర్యల్లో భాగం గా అవసరమైతే ప్రాణత్యా గం చేయాలన్న నిబద్ధతకు సిరాజ్, సమీర్ అంగీకరించారు.ఈ ఘోర కుట్ర వ్యూహం గట్టిగానే మెలిగింది కానీ, కేంద్ర బలగాల రాష్ట్ర పోలీసుల నిఘాకు చివరికి లొంగిపోయింది. వీరి పక్కా కమ్యూనికేషన్, విదేశీ నిధుల ప్రవాహం,ఐ ఈ డి తయారీ సామర్థ్యం అన్నీ కలిపి ఒక దేశవిద్రోహ కుట్రగా వెలుగులోకి వచ్చింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments