
ఆదివాసి జెఎసి చింతూరు డివిజన్ చైర్మన్ జల్లి నరేష్-
పయనించే సూర్యుడు రిపోర్టర్ జలి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 2 అల్లూరి సీతారామరాజు జిల్లా
చింతూరు మండలం నరసింగపేట గ్రామం పెద్దసీతనపల్లి గ్రామపంచాయతీ పెద్ద సీతన పల్లి గ్రామంలో ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసి జేఏసీ చింతూరు డివిజన్ చైర్మన్ జల్లి.నరేష్ ఆదివాసీ ఉద్యోగ జేఏసీ నాయకులు తిమ్మా సాయి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో పెద్ద సీతనపల్లి గ్రామం పెద్దల సమక్షంలో మరియు మహిళలు విద్యార్థుల ఆధ్వర్యంలో సర్పంచ్ అమ్మాజీ ఆదివాసి జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఆగస్టు 1 నుంచి 9 వరకు ప్రతి గ్రామం లో, ఇంటిపైన ఆదివాసి జెండా ఏ రాజకీయ పార్టీ కి అనుబధం కానీ ఆకు పచ్చ జెండా మరియు గొండ్వాన జెండాలను ఆదివాసి యువతీ యువకులు స్వచ్ఛందంగా గ్రామాలలో ఆవిష్కరణ చేయాలని వారు పిలుపునిచ్చారు అదే విధంగా ఆదివాసీ జేఏసీ చైర్మన్ జల్లి నరేష్ మాట్లాడుతూ ఆగస్టు 8 న చలో మారేడుమిల్లి ప్రోగ్రామ్ ఎందుకు ఆగస్టు 9 అంటే అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తు ఆదివాసి సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని దీని ద్వారా మెగా డీఎస్సీ నుంచి ఏజెన్సీ పోస్ట్లను మినహాయించి ఆదివాసి నిరుద్యోగులకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని సభ నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజున ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు గారు గతం లో ఇచ్చినటువంటి హామీ ప్రకారంఏజెన్సీ ప్రాంత ఆదివాసీలకు షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియమంగా చట్టాన్ని ప్రకటించి ఆగస్టు9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం కానుకగా ఆదివాసీలకు ప్రకటించాలని డిమాండ్ చేసారు ఆ సభకు ఆదివాసి ప్రజానీకం ఆదివాసి మేధావులు ఆదివాసి ఉద్యోగులు ఆదివాసి విద్యార్థులు ఆదివాసి సమాజం మొత్తం కూడా చలో మారేడుమిల్లి కార్యక్రమానికి వేలాదిగా రాష్ట్రం నలుమూలల నుంచి తరలిరావాలని ఆయన కోరారుఅలాగే 1/70చట్టం, పేసా చట్టాలను ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏజెన్సీ ప్రాంతంలో కచ్చితంగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో మడకం లక్ష్మయ్య ఆదివాసి జేఏసీ వైస్ చైర్మన్ తమ్మయ్య ఆదివాసి ఉద్యోగ చేసిన నాయకులు తోడ దేసయ్య ఆదివాసి జేఏసీ మండల ఆదివాసీ నాయకులు పోడియం లక్ష్మణ్ మడివి చందు మూట గంగయ్య మరియు సీతయ్య సుబ్బు తదితరులు పాల్గొన్నారు
