
ఆగస్టు 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలు చట్టాన్ని ప్రకటించాలి ఆదివాసీ జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ పిలుపు
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 31
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి z.p స్కూల్ గ్రౌండ్ నందు ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి ఆధ్వర్యంలో ముందస్తు ఆగస్టు 8వ తేదీన రాష్ట్రస్థాయి ఆదివాసి ఆదివాసీ దినోత్సవ సభను నిర్వహించడం జరుగుతుందని ఆసభను నియోజకవర్గ ఆదివాసి ఉద్యోగులు, ఆదివాసి మేధా వర్గం ఆదివాసి ప్రజానికం ఆదివాసి విద్యార్థి లోకం మొత్తం కూడా ఆదివాసి దినోత్సవ సభలో పాల్గొని ఆదివాసి దినోత్సవ సభను విజయవంతం చేయాలని అలాగే చింతూరు డివిజన్లోని ఎటపాక, కూనవరం,విఆర్ పురం మండలాల్లో కూడా ఆగస్టు 1 నుండి 9 తేదీ వరకు కూడా ప్రతి గూడెంలో ప్రతి ఇంటిపైన ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని 9 పురస్కరించుకొని ఆదివాసి జెండాను ఎగరేయాలని దానికి అన్ని వర్గాల ఆదివాసీలు ప్రజా,ప్రతినిధులు సర్పంచ్ లు,ఎంపీటీసీ లు పాల్గొనాల్సిందిగా చింతూరు డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని అన్ని ఐటీడీఏల్లో కూడా ఘనంగా నిర్వహిస్తూ ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వశాఖలలో కూడా ప్రభుత్వం అధికారికంగా ఆదివాసీ జెండా ఆవిష్కరణ చేయాలని చేయాలనీ దానికి ఐటీడీఏ ఉత్తర్వ లు ఇవ్వాలి ఆయన అన్నారు అలాగే ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు గతంలో అరకు వేదికగా ఎన్నికల హామీ ను ఆదివాసీలకు ఆదివాసి నిరుద్యోగులకు ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని ఉద్యోగాలు వందకు వందశాతం ఆదివాసీలకే కేటాయిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు అట్టి హామీని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టాన్ని ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టలకు విరుద్ధంగా వలస గిరిజనేతరులను పై కూడా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతం వలసలను నిరోధించాలని ఆయన పేర్కొన్నారులేదంటే రాబోయే రోజులలో ఆదివాసీ ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు