
ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసి జేఏసీ
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి జులై 31
పలుమార్లు ఆదివాసీలకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని మరియు షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే చేయాలని ది.08.08.2025 శుక్రవారం నాడు మారేడుమిల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లో కారం తమ్మన్న దొర ప్రాంగణం నందు ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసి జేఏసీ తలపెట్టిన అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని షెడ్యూల్డ్ ప్రాంతాల ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ నాయకులు,ఆదివాసి మేధావులు, ప్రజలు,పెద్దలు,మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు,ప్రజా ప్రతినిధులు,విద్యార్థులు, యువత అందరూ కూడా స్వచ్ఛందంగా తప్పనిసరిగా హాజరుకావాలని ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసి జేఏసీ రాష్ట్ర కమిటీ నాయకులు మరియు రంపచోడవరం డివిజన్ నాయకులు కంగల శ్రీనివాసు, మట్ల కృష్ణారెడ్డి,తెల్లం శేఖర్,మడకం ప్రసాద్,చవలం శుభ కృష్ణ, పండ పవన్ కుమార్ దొర పోడియం పండు దొర, పోడియం శ్రీను బాబు,కత్తుల రమణ రెడ్డి,కర్రి సన్యాసి రెడ్డి,కారం రామన్నదొర,పందుల కామరాజు, పల్లాల రాజకుమార్ రెడ్డి, పల్లాల లింగారెడ్డి మొదలగువారు పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆదివాసీలు అందరూ తప్పనిసరిగా హాజరయ్యి ఈ సభను జయప్రదం చేయాలని కోరుచున్నాముడిమాండ్స్:1). షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే చేయాలి.2). పూర్వపు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల షెడ్యూల్ ప్రాంతాలు మరియు ముంపు మండలాలను కలిపి కారం తమ్మన్నదొర పేరుతో “రంపచోడవరం జిల్లా”ను ఏర్పాటు చేయాలి.
3). మెగా డీఎస్సీ 2025 లోని ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా స్థానిక ఆదివాసీలతోనే భర్తీ చేయాలి.4). బోగస్ ఎస్టి సర్టిఫికెట్ల నిర్మూలనకు ప్రత్యేక కమిషన్ ను నియమించాలి.5). పోలవరం నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం మరియు పునరావాసం కల్పించి భూ సేకరణలో జరుగుతున్న అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలి.6). అసెంబ్లీ ఆవరణలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ (టీ.ఎ.సి )భవనాన్ని వెంటనే నిర్మించాలి.
7). ఆదివాసి పోరాటయోధుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి మరియు ఆదివాసీ యోధుల విగ్రహాలను అన్నిచోట్ల నెలకొల్పాలి.8). 1/70 చట్టం, పీసా, ఆర్.ఓ.ఎఫ్.ఆర్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలను పటిష్టంగా అమలు పరచాలి.9). రాష్ట్రంలోని షెడ్యూల్ ఏరియాలో మంజూరు చేసిన అన్ని హైడ్రో పవర్ ప్రాజెక్టులను వెంటనే రద్దు చేయాలి.10). నాన్ ట్రైబ్స్ అక్రమ వలసలను అరికట్టడానికి, వారికి ఏజెన్సీలో జారీ చేసినటువంటి అన్ని గుర్తింపు పత్రాలను మరియు సంక్షేమ పథకాలను రద్దు చేయాలి.
