
పయనించే సూర్యుడు మార్చు 9 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి జందాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో చందా టీ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివా రం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది, ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు వివరాల్లోకి వెళ్తే.. ఆదిలా బాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న ఒక ఐషర్ వ్యాన్ టైర్ ప్రమాదవశాత్తు పేలిపో యింది. అనంతరం ఆ వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం ఇండి కేషన్ లైట్లు కూడా ఆగిపోయాయి. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి జబల్పూర్ వెళ్తున్న కాంకర్ ట్రావెల్స్ బస్సు.. వేగంగా దూసుకొచ్చి వ్యాన్‌ను ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్‌తో పాటు అందులోనే ఉన్న అదనపు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది ప్రయాణి కులు తీవ్రంగా గాయపడ్డా రు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్య లు చేపట్టారు. మృతదేహాల ను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చాలా వరకు అందరు స్వల్ప గాయాలతో బయటపడినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.