
అశ్వాపురం సిఐ జి అశోక్ రెడ్డి.
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 21,అశ్వాపురం: భద్రాది కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి సూచనల మేరకు మండలంలోని ఆటోల యజమానుల నుంచి అవసరమైన డాక్యుమెంట్ల సమాచారం సేకరించి డిజిటలైజేషన్ చేసిన సమాచార యాప్ స్టిక్కర్లను ఆటో డ్రైవర్ వెనకాల అంటించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు పోలీసు యంత్రాంగం పని చేస్తున్నదని, మండలంలో ఆటోలో ప్రయాణించే వారికి పూర్తి భద్రత, భరోసా కల్పించడమే పోలీసుల లక్ష్యమని అన్నారు. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించొద్దని డ్రైవర్లకు సూచించారు. ఆటో ఎక్కగానే ప్రయాణికులు డ్రైవర్ వెనకాల అంటించిన స్టిక్కర్‌ను ఫొటో తీసి పెట్టుకోవాలని సూచించారు. ఏదైనా అనుకోని ఘటన జరిగితే వెంటనే ఆ ఫొటోను పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు, రాత్రి సమయాల్లో ఆటో డ్రైవర్లుఅధిక మొత్తం వసూలు చేసిన మార్గమధ్యంలో వదిలేసిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో అశ్వాపురం ఎస్ఐ షేక్ సైదా రాహుఫ్, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.