
ప్రజలు అడగని హామీలను ఇచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసం..
ప్రజల కోసం నడవాల్సిన బస్సులు ప్రభుత్వ ఆదాయం కోసం వసూలు యంత్రాలుగా మారాయి.
(పయనించే సూర్యుడు అక్టోబర్ 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
బస్సు ఛార్జీల పెంపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీజేపీ యువ నాయకుడు పసుపుల ప్రశాంత్ తీవ్రంగా విమర్శించారు.ఒక వైపు ఆడవారికి ఫ్రీ బస్సు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ, మరో వైపు అదే డబ్బును మగవాళ్లతో వసూలు చేయడం ప్రజలను మోసం చేయడమే. ఇది సూటిగా ఆడవాళ్ల ఫ్రీ పాస్ పేరు చెప్పి, మగవాళ్ల జేబులు ఖాళీ చేయడమే,అని ఆయన ఎద్దేవా చేశారు.మొన్న దసరా ఆఫర్ పేరుతో హైదరాబాద్ నుండి షాద్‌నగర్ వరకు 30 రూపాయలు పెంచి, ఇప్పుడు మళ్లీ ఛార్జీల పెంపు. ప్రజలు అడగని హామీలను ఇచ్చి వాటికోసం తిరిగి అదే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి పాలన చూసి ప్రజలు నవ్వుతున్నారు, కాంగ్రెస్ పాలన అంటే ఇదేనని చెబుతున్నారు,అని ప్రశాంత్ వెటకారంగా వ్యాఖ్యానించారు.“ప్రజల కోసం నడపాల్సిన బస్సులు ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం కోసం వసూలు యంత్రాలుగా మారాయి. ప్రజా ప్రయోజనాల పేరుతో భారం మాత్రం సాధారణ మనిషి భుజాలపై వేస్తున్నారు,అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.“ఇంకా ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తుంది,” అని ప్రశాంత్ హెచ్చరించారు.