
పయనించే సూర్యుడు మార్చి 24 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన ఆత్మకూరు సబ్ డివిజన్ పోలీసులు ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్ర ఏర్పడి చేయడం అభినందనీయమని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి ఆత్మకూరు డిఎస్పి సూచనల మేరకు పోలీస్ అధికారులు సిబ్బంది ఏర్పాటు చేసిన చలివేంద్రం ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుత వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాల ఎదురుగా ప్రయాణికులకు వైద్యశాలకు వచ్చే రోగు లకు ఉపయోగకరంగా రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన చలివేంద్రమును మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. పట్టణంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి వచ్చిన మంత్రి ఆనం పోలీస్ అధికారుల విజ్ఞప్తితో చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తీవ్రమైన ఎండా కాలంలో ప్రజలకు ఉపయోగకరంగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు పోలీసు వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఆత్మకూరు డిఎస్పి కే వేణుగోపాల్, సిఐ గంగాధర్,వేమారెడ్డి, సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కంచి పరమేశ్వర్ రెడ్డి, ఎస్సై జిలాని, సాయి , సైదులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరు గిరి నాయుడు, కాటంరెడ్డి రవీంద్ర రెడ్డి, తుమ్మల చంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు నాయుడు, అధికారులు తదితరులు పాల్గొన్నారు