
పయనించే సూర్యుడు జూలై 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ యూనియన్ ఆత్మకూరు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఎల్ఐసి ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఎల్ఐసి కార్యాలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా తొలి మూడు రోజులు వివిధ రకాల కార్యక్రమం చేపట్టి నేడు స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో కార్యాలయ సిబ్బంది, ఇన్సూరెన్స్ ఏజెంట్స్, గ్రామ యువకులు రక్తాన్ని స్వచ్ఛందంగా అందించారు. ఈ కార్యక్రమాన్ని జీవిత బీమా సంస్థ ఎంప్లాయిస్ యూనియన్ ఆత్మకూరు బ్రాంచ్ అధ్యక్షులు రమేష్, కార్యదర్శి శ్యాం ప్రభాకర్, సాయి తేజ, రమాదేవి ల ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ ప్రముఖలైన చండ్ర. వెంకటసుబ్బనాయుడు సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, రెడ్ క్రాస్ ఆత్మకూర్ చైర్మన్ సాధిక్ హుస్సేన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సందాని, ఎన్జీవో వాగాల శ్రీహరి, ఆత్మకూరు నాగయ్య, సురేష్ బాబు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారికి కార్యక్రమనికి సహకరించిన అందరికీ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్యామ్ ప్రభాకర్, అధ్యక్షుడు రమేష్ ధన్యవాదాలు తెలిపారు.