
పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 ( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించిన ఆత్మకూరు ఆర్టీసీ డిపో మేనేజర్ షేక్.కరీమున్నీసా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపో పరిధిలో ఆర్టీసీ బస్సుల సంబంధించిన సమస్యలు . సలహా సూచనల కొరకు గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించిన డైల్ యువర్ డిఎం కార్యక్రమంలో హాజరైన ఆత్మకూరు ఆర్టీసీ డిపో మేనేజర్ షేక్ కరీమున్నీసా. తమ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రయాణికుల నుండి వచ్చిన ఫోన్ కాల్స్ కు సమాధానం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రయాణికులు డిఎం కరీమున్నీసా కు ఫోన్ కాల్స్ చేసి డిపో పరిధిలో సమస్యలను అవసరాలను పలు సలహాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి వస్తున్న ఫోన్ల సమాచారాన్ని డిపో మేనేజర్ సూచనలతో డిపో ఏడిసి భాస్కర్ రెడ్డి నమోదు చేసుకున్నారు.వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలను ప్రజలు సూచించిన సలహాల గురించి ఆర్టీసీ డిపో మేనేజర్ షేక్.కరీమున్నీసా మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఫోన్ కాల్స్ ను స్వీకరించి తగు రీతిన సమాధానం తెలిపినట్టు తెలిపారు..ఏ ఎస్ పేట నుండి కసుమూరుకు . ఆత్మకూరు నుండి విజయవాడ, విశాఖపట్నం లకు బస్సులు కావాలని కొన్ని బస్సు సర్వీసుల సమయాల మార్పులు చేయవలసిందిగా అలాగే మరికొన్ని సలహా సూచనలు తెలిపినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఈ విషయాలన్నిటిని తమ పై అధికారులకు తెలిపి సూచనలు పాటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని స్పందించి ఫోన్ కాల్స్ చేసిన ప్రయాణికులకు ధన్యవాదాలు తెలుపుతూ డిపో పరిధిలో అవసరాలైన సలహా సూచనలు తప్పకుండా పాటిస్తామని తెలిపారు.