
పయనించే సూర్యుడు మార్చి 13 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మున్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు ప్రభుత్వ ఆరోగ్య వైద్యశాలలో మార్చి13 ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా అపోలో డైయాలసిస్ మేనేజర్ సురేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సుపురిండెంట్ శేషరత్నం,ఆర్ ఎం ఓ ఉషా సుందరి మాట్లాడుతూ థీమ్ డిటెక్ట్ ఎర్లీ, ప్రొటెక్ట్ కిడ్నీ గురించి అందరూ జాగ్రత్తలు పాటించాలి అని మాట్లాడారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కిడ్నీ వ్యాధిగస్థులను భవిష్యత్ లో తగ్గించడమే ముఖ్య లక్ష్యం గా అపోలో యాజమాన్యంభావిస్తున్నారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఆసుపత్రి మెడికల్ సుపురిండెంట్ శేషరత్నం,ఆర్ ఎం ఓ ఉషా సుందరి, ఏ ఓ శ్రీనివాసులు రెడ్డి, అపోలో మెడికల్ ఆఫీసర్ అనూష,ఆత్మకూరు అపోలో డయాలసిస్ క్లినిక్ మేనేజర్ సురేంద్ర బాబు, నర్సింగ్ సుపురిండెంట్ ,ఆశా వర్కర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

