
పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కొరకు ఆత్మకూరు విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించిన విద్యుత్ శాఖ అధికారులు.విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్పర్సన్ రిటైర్డ్ జడ్జి వి. శ్రీనివాస ఆంజనేయమూర్తి అధ్యక్షతన వీరితో పాటు వచ్చిన ప్రత్యేక బృందం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సమస్యలపై డివిజన్ పరిధిలోని పలువురు వినియోగదారులు అర్జీలు అందించారు.ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి పరిశీలిస్తామని అదాలత్ అధికారులు అర్జీదారులకు హామీ ఇచ్చారు. ఆత్మకూరు విద్యుత్ శాఖ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు, ఏడిఈ చిన్నస్వామి నాయక్, ఏడీలు డివిజన్లోని ఏఈలు అధికారులుహాజరయ్యారు. ఆత్మకూరు విద్యుత్ శాఖ పట్టణ ఏఈ జమీల బేగం . ఏఈలు కార్యక్రమానికి ఆత్మకూరు పట్టణ ప్రజలు . సిపిఎం పార్టీ నేతలు . రైతు సంఘం నేతలు పలు సమస్యలపై వినతి పత్రం అందించారు.