
పయనించే సూర్యుడు మార్చి 21 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి . దేవాదాయ ధర్మాదాయ మంత్రి. ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలోతెలుగుదేశం, బిజెపి మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఈ నెల 23వ తేదీ న ఆదివారం ఉదయం 10.గంటలకు ఆత్మకూరు నియోజక వర్గ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ సముదాయం ఎదురుగా ఉన్న స్టేడియం ప్రక్కన గ్రౌండ్ నందు .ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం. ఏర్పాటు చేయడమైనది. వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్ల అందజేత కార్యక్రమం కూడానిర్వహించెదరు.తదుపరి అందరికీ భోజన వసతి ఏర్పాటు చేయబడినది. కావున ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయానికి కృషి చేసిన కార్యకర్తల,అభిమానులు అందరూ ఈ ఆత్మీయ సమావేశం లో పాల్గొన వలసినదిగా ఆహ్వానిస్తూ. ముఖ్యులందరికీ సదరు సమాచారం తెలియజేసి నాయకులు,కార్యకర్తలు అందరూ సమావేశానికి హాజరు కావలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని చేజర్ల మండల టిడిపి అధ్యక్షులు రావి. లక్ష్మీ నరసారెడ్డి శుక్రవారం తెలిపారు