
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 22
కమ్యూనిస్టు యోధులు కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్చితానందన్ అమరజీవి కమ్యూనిస్టు ఆదర్శప్రాయుడు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో జీవించే ఉంటారు అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సీసం సురేష్ అన్నారు,మంగళవారం నాడు సిపిఎం పార్టీ కార్యాలయం నందు కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరజీవి వి ఎస్ అచ్యుతానందన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించడం జరిగినది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సీసం సురేష్ మాట్లాడుతూ ఎనిమిది దశాబ్దాలుగా రాజకీయాల్లో ఎన్ని గొడవలు వచ్చిన నిలుచని ప్రజలకు ఆదర్శనేతగా ఉన్నారని యుక్త వయసులోనే కార్మిక సమస్యలపై పనిచేస్తూ కమ్యూనిస్టు నాయకుడుగా ఎదిగి సాధారణ కుటుంబం నుంచి దేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా కేరళ రాష్ట్ర ప్రజలకు ఆదర్శనేతగా అంచలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే కమ్యూనిస్టు దిగజాలలో ఒకరుగా ఎదిగి మచ్చలేని మహానేతగా అన్నారు ఈ దేశంలో రాజకీయాలు కుళ్లు కుతంత్రాలతో అవినీతి అక్రమాలతో అనేక రకాల మార్పులు చెందుతున్న కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో ముఖ్యపాత్ర వహించడం ఆదర్శనేతగా ప్రజా పాలకుడుగా మచ్చలేని నాయకుడిగా ఉన్న కామ్రేడ్ అచ్చితానందన్ అమర జీవిగా ఉంటారని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పోడియం లక్ష్మణ్ కారం సుబ్బారావు, పల్లపు రాములు, జల్లి నాగేశ్వరరావు, రాజు, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.