Thursday, May 22, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటి

ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటి

Listen to this article

.పత్రిక ప్రకటన

తేది.21.5.2025 చింతూరు

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాడేరు పర్యటనలో మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ పోస్టులు మినహాయింపు ఇవ్వాలి ఏజెన్సీ ప్రాంతాల్లో వంద శాతం ఉద్యోగ ఉపాద్యాయ నియామక చట్టం ఏర్పాటు పై ప్రకటన చెయ్యాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లోసురేంద్ర రాష్ట్ర అధ్యక్షుడు లోత రాంబాబు డిమాండ్ చేశారు చింతూరులో జేఎసి ఆధ్యర్యంలో జరుగుతున్న దీక్షలకు పాల్గొని మద్దతు తెలిపారు ఏజెన్సీ ప్రాంతాల్లో వంద శాతం ఉద్యోగ ఉపాద్యాయ నియామక చట్టం చెయ్యాలని డిమాండ్ చేస్తూ జేఏసీ చేస్తున్న దీక్షలకు పాల్గొని మద్దతు తెలిపారు పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి మే 21 మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీపోస్టులు వాయిద వేయాలనీ పాడేరులో జూన్ ఒకటిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నట్లు వార్తల్లో వచ్చిందని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి పాడేరు ఏజెన్సీ పర్యటనలో ఏజెన్సీలో నూరుశాతం ఉద్యోగ, ఉపాద్యాయ నియామక చట్టం పై స్వస్త మైన ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేశారు అరకు ఎన్నికల ప్రచార సభ హామీ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏజెన్సీలో వంద శాతం ఉద్యోగ ఉపాద్యాయ నియామక చట్టంపై ప్రకటించలని డిమాండ్ చేశారు ఆదివాసులకు న్యాయం జరగాలంటే ఏజెన్సీ ప్రాంతంలో వందశాతం రిజర్వేషన్లు కల్పిస్తేనే న్యాయం జరుగుతుందని మిగతా ఆప్షన్లు అమలు చేస్తే ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చంద్ర బాబు ఎన్నికల హామీ ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో వంద శాతం ఉద్యోగ ఉపాద్యాయ నియామక చట్టం చెయ్యాలని డిమాండ్ చేశారు మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ పోస్టులు వాయిద వెయ్యాలనే విషయమై పాడేరు పర్యటనలో ముఖ్యమంత్రి నిర్ణయం చెయ్యాలని డిమాండ్ చేశారు డీఎస్సీ దరఖాస్తు గడువు ముగిచిన ప్రభుత్వం జోక్యం చేసుకోలేదనీ మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ పోస్టులు వాయదవేయ్యాదంపై ఇప్పటి వరకు ఆదివాసులకు న్యాయం జరగలేదని అవేదన వ్యక్తం చేశారు చింతూరు ఐటిడిఎ ముందు జేఏసీ ఆధ్యర్యంలో జరుగుతున్న దీక్షలకు ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లోసురేంద్ర అధ్యక్షుడు లోత రామారావు ,రంపచోడవరం కార్యదర్శి పులిశంతోష్,జిల్లా ఉప అధ్యక్షులు పూనెం ప్రదీప్ జిల్ల సహాయ కార్యదర్శి సీసం సురేష్ పాల్గొని మద్దతు తెలిపారు అనంతరం ఆదివాసీ సంఘాలు అందరూ ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపిచ్చారు
జేఏసీ నేతలు కుంజ అనిల్,జల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments