
తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు..
పయనించే సూర్యుడు // మార్చ్ 3 // హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్// కుమార్ యాదవ్..
హుజురాబాద్ లో ఆదివాసి తెగలను గుర్తించి ఎస్టిలో ఏబిసిడి వర్గీకరణ చేపట్టే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేయాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు డిమాండ్ చేశారు. సోమవారం రోజున హుజురాబాద్ లోని ఆ సంఘం కార్యాలయంలో తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు మాట్లాడుతూ..అత్యధికంగా జనాభా కలిగి ఉన్న లంబాడీలను కోయ, గోండులను పరిగినలో తీసుకొని ఎస్టీ వర్గీకరణ జరుగితే ఆదివాసి ఎరుకలకు అన్యాయం జరుగుతుందని రాజు పేర్కొన్నారు. విద్యాపరంగా ఉద్యోగ పరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందని ఆదివాసి ఎరుకలకు తీవ్రమైన నష్టము జరుగుతుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలకు అనుగుణంగా రిజర్వేషన్ ఫలాలు 10 సంవత్సరాలు కొనసాగాలని రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నదన్నారు. అదే రాజ్యాంగంలో 10 సంవత్సరాలు లోపు అభివృద్ధి చెందని తెగలను గుర్తించి మళ్లీ పది సంవత్సరాలు రిజర్వేషన్ పొడిగించి వారి అభివృద్ధికి తోడ్పడాలని రాజ్యాంగం చెబుతుందని రాజు గుర్తు చేశారు. రాజ్యాంగ ఫలాలు అధికంగా అనుభవిస్తూ..అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న లంబాడీలను, కోయ, గోండు తెగలను ఎస్టీ తెగలతో కలిపి ఎస్టిలో ఏబిసిడి వర్గీకరణ చేస్తే ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేని ఎరుకల, తోటి, చెంచు, నక్కల, కమ్మర తెగలు నష్టపోవడం జరుగుతుందన్నారు. రాజ్యాంగం మరియు సుప్రీంకోర్టు సూచించిన సామాజిక ప్రాథమిక సూత్రాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందని ఆదివాసి తెగలను గుర్తించి మరియు అన్ని విధాలుగా ఆలోచించి ఎస్టిలో ఏబిసిడి వర్గీకరణ చేపట్టే ఆలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజు డిమాండ్ చేశారు