
పయనించే సూర్యుడు రిపోర్టర్ నరేష్ చ డివిజన్ ఇంచార్జ్ జులై 12
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండల సమావేశంలోఆదివాసి పోరాట యోధుడు కొమరం భీమ్ విగ్రహాన్ని కూనవరంలో ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్,జిల్లా అధ్యక్షులు రామారావు దొర డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఏపీ ఆదివాసి జేఏసీ జిల్లా అధ్యక్షులు రామారావు మాట్లాడుతూ… అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం,కూనవరం మండలం,కోతులు గుట్ట గ్రామంలో సచివాలయం ఎదురుగా ఉన్న ఆదివాసీల ఆరాధ్య దైవం ఆదివాసిల పోరాట యోధుడు కొమరం భీమ్ విగ్రహాన్ని ఈనెల 9వ తేదీ బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం మరియు అదే రోజు జగ్గవరం క్రాస్ రోడ్డు ఆదర్శ స్థూపం వద్దన్న జెండా కర్రను పీకి వంద మీటర్ల దూరంలో పారేయటం జరిగింది.ఆదివాసి సమాజంలో ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్న ఆసాంఘీక శక్తులను వెంటనే ప్రభుత్వం పట్టుకొని కఠినమైన శిక్షలు విధించాలన్నారు.ఆదివాసుల ఆత్మగౌరవాన్ని కించపరిచే దుష్టశక్తులను కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో క్యూట్ ఏజెన్సీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు.యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం తక్షణమే స్పందించి అసాంఘిక దుష్టశక్తులను పట్టుకుని కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.