Thursday, October 30, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆదివాసి లారా అల్లూరి జిల్లా ని కాపాడుకుందాం ఆదివాసి జిల్లా లేకుండా చేసే కుట్ర జరుగుతుంది

ఆదివాసి లారా అల్లూరి జిల్లా ని కాపాడుకుందాం ఆదివాసి జిల్లా లేకుండా చేసే కుట్ర జరుగుతుంది

Listen to this article

ఆదివాసి సంక్షేమ పరిషత్

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 29

ఆదివాసి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఆదివాసులు మేల్కోవాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను బుధవారం నాడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. పార్వతిపురం మన్నెం జిల్లా పేరుకి ఆదివాసి జిల్లా అయినప్పటికీ దాని హెడ్ క్వార్టర్ పార్వతీపురం అంటే అది మైదాన ప్రాంతం, పార్వతిపురం ఏజెన్సీ అయినప్పటికీ అది ప్రస్తుతం ఏజెన్సీగా సెలవనిలో లేదు. ఇక ఏలూరు జిల్లాలో ఉన్న ఐదు ఏజెన్సీ మండలాలు కూడా మైదాన ప్రాంత హెడ్ క్వార్టర్ జిల్లాలోని ఉన్నాయి. ఉన్న ఒక్క గని ఒక్క ఆదివాసి జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. మనవడిగే రంపచోడవరం డిమాండ్ న్యాయమైన కోరిక కానీ అది శాస్త్రీయతా పేరుతో, అలాగే మనం చెప్పుకునే దూర భారాల పేరుతో అల్లూరి జిల్లా ని చీల్చాలని చూస్తున్నారు. ఆదివాసి సంక్షేమ పరిషత్ పోరాట ఫలితంగా ఆ రోజే రాజమండ్రి లో కలపకుండా ఉద్యమము చేయడం వలన రంపచోడవరం నియోజకవర్గం అల్లూరు జిల్లాల్లో చేర్చబడ్డాయి. అప్పుడు హెడ్ క్వార్టర్ గా పాడేరని ఏర్పాటు చేయడం జరిగింది. పక్క ఏజెన్సీ జిల్లా అది కూడా ఏజెన్సీ హెడ్ క్వార్టర్లు ఉండటం అంటే ఇది ఆదివాసులకు భవిష్యత్తులో ఒక వరంగానే భావించాలి. దూరబారాలు పేరుతోటి మనం ఒక కొత్త నినాదము బయటకి తీసుకురావడం వలన రంపచోడవరం నియోజకవర్గాన్ని రాజమండ్రిలో కలిపే కుట్రలకు మనమే దారి చూపిస్తున్నాము. తిరిగి మల్ల మైదాన ప్రాంతం ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలోకి వెళుతున్నాయి. ఏలూరు ఏజెన్సీ ప్రాంతాన్ని రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతాన్ని కలిపి ప్రత్యేక జిల్లా చేస్తే సంతోషకరమే కానీ శాస్త్రీయంగా చట్టపరంగా అది సాధ్యం కాదు అంటూ దాటివేస్తారు. ఒకవేళ ఏదో రకంగా సాధ్యమైనప్పటికీ దాన్ని నాన్ ట్రైబల్స్ చేయనివ్వరు కూడా. దూరమో భారమో మనకంటూ ఒక ప్రత్యేక ఆదివాసి జిల్లా ఉంది ఆ జిల్లాని కూడా కాపాడుకోలేని స్థితిలో మనం మిగిలిపోతున్నాం. గత ప్రభుత్వం మంచి చేసిందో చెడు చేసిందో పక్కన పెడితే ఇది రాజకీయ పార్టీల మీద చేస్తున్న రాజకీయ ప్రకటన కాదు అల్లూరు జిల్లా ఆదివాసులకు ఒక వరమే. ఆదివాసుల ఐక్యత అంటూ నినాదాలు చేసుకునే మనం పాడేరా ఆదివాసులతో కలిసి ఉండటానికి మనకేంటి ఇబ్బంది. మన ఆదివాసి మిత్రులు కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే ఒక్క ఆదివాసి జిల్లా నైనా ఆంధ్రప్రదేశ్లో చూడగలము. లేదంటే యధాతధ ప్రజారాజ పూర్వపు 13 జిల్లాల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి.అంతేకాదు అసలు అల్లూరి జిల్లాకు పాడేరు హెడ్ క్వార్టర్ కూడా ఉండదు. తీసుకెళ్లి మా డుగులు నియోజకవర్గంలో కలుపుతారు. ఎందుకంటే రంపచోడవరం నియోజకవర్గం న్ని తూర్పుగోదావరి జిల్లాలో కలిపితే అల్లూరు జిల్లాలో మిగిలేది 11 మండలాలు మాత్రమే. మన ప్రాంతం విస్తీర్ణపరంగా పెద్దగా ఉండొచ్చు కానీ జనాభా పరంగా తక్కువ సంఖ్య ఉన్నవాళ్లుము. జిల్లాల విభజన అనేది విస్తీర్ణం చూసి ఇవ్వరు. గత ప్రభుత్వం తప్పుడు తడకలుగా జిల్లాల విభజన చేసిందని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిపై బురద చల్లుతూ కొత్త జిల్లాలను తెరమీదకి తీసుకొచ్చి. కొత్త జిల్లాలు చేయాలనుకుంటే పాత ప్రభుత్వం మీద బురద జలాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఇది ఒక భాగం. రేపు ఇంకో ప్రభుత్వం కూడా వచ్చి ఇప్పుడు చేసిన జిల్లాలు తప్పని ప్రస్తుత ప్రభుత్వాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం నిందిస్తుంది. ఇటువంటి రాజకీయ కుట్రలో మనం భాగమైతే మనకు నష్టమే. అసలు ఆదివాసి జిల్లా అనే లేకుండా కుట్ర చేస్తుంది. ఆదివాసి సంక్షేమ పరిషత్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు గత ప్రభుత్వం చుట్టం కాదు ప్రస్తుత ప్రభుత్వం వ్యతిరేకి కాదు. ఆదివాసుల కోసం ఉన్న ఒక్క జిల్లానైనా కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. అల్లూరి జిల్లా కాపాడుకుందాం ప్రభుత్వ కుట్రలను తిప్పికొడదాం. మేలుకో ఆదివాసి ఏనుకో ఏజెన్సీ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments