
నవోత్సవంలో భాగంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను పిలుపు
ప్రయాణించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగస్టు 2
ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఆగస్టు 9న పురస్కరించుకుని ఆదివాసి సంక్షేమ పరిషత్(274/16) నిర్వహిస్తున్న నవోత్సవాల్లో భాగంగా శనివారం నాడు ఎటపాక లోని బాలికల ప్రాథమికోన్నత ఆశ్రమ పాఠశాలలో మరియు వైటీసీలో ట్రైనింగ్ విద్యార్థులకు ఆదివాసి చట్టాలపై ప్రపంచ ఆదివాసి దినోత్సవం యొక్క ఆవశ్యకత పై సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ ప్రతి ఆదివాసి విద్యార్థి యువతి యువకులు భారత రాజ్యాంగం ఆదివాసులు కల్పించిన చట్టాలపై హక్కులపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఉన్నత విద్యను అభ్యసిస్తూ విద్య ఉద్యోగ ఉపాధి వ్యాపార రాజకీయ వంటి ఉన్నత రంగాలలో రాణించాలని ఆయన విద్యార్థులను కోరారు. భారత రాజ్యాంగం ఆదివాసులు కల్పించిన చట్టాలు అమలకు నోచుకోక ఆదివాసులు హక్కులకు దూరమవుతున్నారని, ఎంతోమంది ఆదివాసీల పోరాటాల ఫలితంగా అంబేద్కర్ కృషి ఫలితంగా రాజ్యాంగం ద్వారా ఆదివాసులకు సంక్రమించిన చట్టాలు నేడు అమలకు నోచుకోకపోవడంతో ఏజెన్సీలో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు, ఏజెన్సీలో ఉన్న వనరులన్నీ కూడా బయట వాళ్ళు దోచుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఆదివాసి చట్టాలు సరిగ్గ అమలు కాకపోవటం వలన ఐదవ షెడ్యూల్ భూభాగం మొత్తం కూడా పరాయిపాలనాలో వెళుతుందని, ఆదివాసులు సొంత గడ్డపై ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవించాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఆదివాసి సంస్కృతి తోనే ఆదివాసులకు ఆత్మ అభిమానం దక్కుతుందని ఆదివాసి సంస్కృతిని కోల్పోతే ఆదివాసులు ఆత్మనుణ్యత కు గురవుతారని, కావున ఆదివాసికి తమ హక్కులు సాధించాలంటే ఆత్మవిమానం ముఖ్యమని ప్రతి ఆదివాసి ఆత్మ అభిమానంతో బతకాలని తమ జాతి ఉనికి కోసం చట్టాల పటిష్ట అమలు కోసం భావితరాల భవిష్యత్తు కోసం చట్టాలపై అవగాహన పెంపొందించుకుంటూ వాటి అమలు కోసం ఉద్యమించాల్సిన అవసరం కూడా ఉందని ఆయన పిలుపునిచ్చారు. చదువుకునే విద్యార్థులు అందరూ కూడా ఆదివాసి హక్కుల- చట్టాల గురించి తెలుసుకొని తమ తల్లిదండ్రులకు తెలియజేయాలని అదేవిధంగా సాంస్కృతిక పండుగలు సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు మొదలగునవి తల్లిదండ్రుల నుండి విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలలో ఆదివాసి సంస్కృతి చట్టాలు హక్కులు పై ప్రత్యేక సిలబస్ ఏర్పాటు చేసి పాఠ్యాంశాలు చేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఐక్యరాజ్యసమితి ఉద్దేశం కూడా ఆదివాసులు అభివృద్ధి చెందాలని అంతరించిపోతున్న ఆదిమ సమాజాన్ని పరిరక్షించాలని వాళ్ళ హక్కులు వాళ్ళకి పరిపూర్ణంగా అందించాలని అటవీ సంపద ఏజెన్సీ సంపద పూర్తిగా ఆదివాసులకు దక్కిననాడే ఆదివాసుల అభివృద్ధి బాట పడతారని” ఐక్యరాజ్యసమితి అనేక అంతర్జాతీయ సదస్సులు వెల్లడించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి విద్యార్థి నాయకులు , విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్న
