
ఏజెన్సీలో ఉంటూ ఆదివాసి దయ ద్రాక్షనులతో బతుకుతూ ఆదివాసులను విస్మరిస్తున్న కొందరు విలేకరులు.
ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 13
చింతూరులో కొందరు పత్రికా విలేకరులు (అందరు కాదు) ఆదివాసి సమస్యలపై పలు ప్రకటనలు ఇచ్చిన పత్రికలో రాయటం లేదని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ఆవేదన వ్యక్తపరిచారు. ఇటువంటి విలేకరులను ఆదివాసి ప్రాంతాల నుండి బహిష్కరించాలని వారికి ఇచ్చిన గుర్తింపును రద్దు చేయాలని ఆయన పత్రిక ముఖంగా కలెక్టర్ గారిని కోరారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజు కూడా చింతూరు ఐటిడిఏ ఆధ్వర్యంలో జరిగిన ఆదివాసి దినోత్సవ వేడుకలను పలు పత్రికలు ప్రచురించలేదని ప్రైవేట్ కార్యక్రమాలు మాత్రం హైలెట్ చేశారని ఆయన అన్నారు. అలాగే చింతూరులోని అటవీ శాఖ భూములు పై ఆదివాసి సంక్షేమ పరిషత్ ఇస్తున్న ఫిర్యాదులు స్టేట్మెంట్ లను పలువురు విలేకరులు ఉద్దేశపూర్వకంగానే పత్రికలో రాయటం లేదని ఎందుకంటే వారికి కూడా అటివిశాఖ భూములలో అక్రమ కట్టడాలు ఉన్నాయని ఆయన అన్నారు. అటవిశాఖ భూములను ఆర్ అండ్ బి శాఖ మరియు పంచాయతీ, రెవెన్యూ శాఖ భూఆక్రమణ విషయంలో పలుమార్లు ఆదివాసి సంక్షేమ పరిషత్తు అధికారులకు ఫిర్యాదు చేస్తూ పత్రికా ప్రకటనలు ఇస్తున్న ఉద్దేశ పూర్వకంగానే పత్రికలో రాయటం లేదని, ఇన్ని రోజులు ఆదివాసి ప్రాంతాలలో ఆదివాసి వనరులు ఉపయోగించుకుంటూ ఆదివాసి భూభాగంలో వ్యాపారాలు చేసుకుంటూ ఆదివాసి సమస్యలను విస్మరిస్తూ పబ్బం గడుపుకుంటున్న విలేకరులకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే హక్కు లేదని ఆయన అన్నారు. దీనిపై త్వరలోనే జిల్లా కలెక్టర్ మరియు ఆయా సంబంధిత పత్రిక డెస్క్లకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఓ విలేఖరి గతంలో తప్పుడు పద్ధతిలో ఉద్యోగాలు పొందిన వారి యొక్క లిస్టును ఆధారాలతో సహా ఇస్తే ఆయన తప్పుడు పద్ధతుల ఉద్యోగం పొందిన వాళ్ల నుండి సుమారు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 50 వేల వరకు వసూలు చేసినట్లు ఇటీవలనే తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. త్వరలోనే ఇటువంటి వాళ్ళ బాగోతలన్నీ కూడా దశలవారీగా బయటపెడతామని వారికి అనుకూలంగా ఉన్న నాన్ ట్రైబల్స్ కు ఒకలాగా అనుకూలంగా లేని నాన్ ట్రైబల్స్ ఒకలాగా ఉంటూ వారికి నచ్చని వారు ఉంటే వాళ్ల డీటెయిల్స్ ఇచ్చి వాళ్లపై స్టేట్మెంట్లు ఇవ్వండి అని గతంలో కొందరు విలేకరులు తమకు చెప్పినట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. తప్పు చేస్తే ఆదివాసి సంక్షేమ పరిషత్ సొంత ఆదివాసుల్ని కూడ వదిలిపెట్టదని అలాంటిది ప్రభుత్వానికి అధికారులకు మధ్య సమన్వయంగా ఉంటూ ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వానికి తెలియజేసే విలాకర్లే అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ భూముల్లో వ్యాపారాలు చేస్తూ అక్రమ దారులకు కొమ్ముకాస్తూ ఆదివాసులు చేస్తున్న ఫిర్యాదులకు ఆదివాసి కార్యక్రమాలను పత్రికలో కవర్ చేయకుండా ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్న వారిపై తగిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఒక్కొక్క విలేఖరి బాగోతాలను దశలవారికి ఆధారాలతో సహా బయట పెడతామని ఆయన హెచ్చరించారు. నిరంతరం ఆదివాసి సంక్షేమం కోసం పోరాడుతున్న ఆదివాసి సంక్షేమ పరిషత్ కార్యక్రమాలను మరియు ఇతర ఆదివాసి సంఘాల కార్యక్రమాలను నిరంతరం కవర్ చేస్తున్న పత్రిక విలేకరులకు ఆదివాసి సంక్షేమ పరిషత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుందని ఆయన అన్నారు. మా దృష్టిలో మా న్యూస్లు రాసిన వారు మంచివాళ్లు రాయని వాళ్ళు చెడ్డ వారు అని కాదని ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఆదివాసి కార్యక్రమాలను విస్మరిస్తున్నారు అక్రమాలకు పాల్పడుతున్నారు వారిపై మాత్రమే మా ఉద్యమమని ఆయన పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలియజేశారు.