
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జ్ ఏప్రిల్ 22
అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీలం కలసి పోరాడుదాం లేదంటే తోకలు తోకలు కరుసుకొని చచ్చిపోతామని భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు ఆవేదనతో హెచ్చరించారు.జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసీలు కలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆదివాసీలం కూడా కలసి పోరాడుదాం లేదంటే తోకలు తోకలు కరుసుకొని చచ్చిపోయే పరిస్థితి వచ్చేస్తుందని, శత శాతం ఉద్యోగ రిజర్వేషన్ ఇచ్చే జీఓ 3 సుప్రీం కోర్టు రద్దు చేసిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్స్ లలో ఆదివాసీలకీ పూర్తిగా నష్టం జరిగిందని,కూటమి ప్రభుత్వం వచ్చాక మెగ డిఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిన వెంటనే జిఓ3 స్థానంలో మరో జిఓ కానీ, షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాలచట్టం కానీ లేకుండా డిఎస్పీ నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఆదివాసీ ఉద్యోగార్ధులకు తీవ్ర నష్టం కలుగుతుందని భారత్ ఆదివాసీ పార్టీగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భర్త్ డే సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఇచ్చిన నోటిఫికేషన్ ఆదివాసీ ఉద్యోగార్ధులకు తీవ్ర నష్టం కలిగించినప్పటికీ ఉద్యోగార్ధులు ముందుకు రాకపోవడం శోషనీయం,బాధకరం.ఎవరో వచ్చి మీకు ఉద్యోగం ఇవ్వరు.అలా అని జనరల్ లో కొట్టేంత శక్తి లేదు.చాలామందికి తెలియని విషయమేమిటంటే జీఓ 3 ఉన్నప్పుడు 100 శాతం ఉద్యోగాలు వచ్చేవి. జిఓ 3 పోయిన తర్వాత 6 శాతం ఉద్యోగాలు మాత్రమే వస్తాయని,అలాగే ఎస్టీకి 6 శాతం,ఎస్సీకి 15 శాతం,బిసీకి 27 శాతం రిజర్వేషన్లు ఉన్నట్లు,రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని, మిగిలిన 50 శాతం జనరల్ అన్న విషయాన్ని చాలా మందికి తెలియక,6 శాతం రిజర్వేషన్ తో పాటు జనరల్ 50 శాతం కూడా మాదే అన్న ధీమాతో ఉన్నారని,కోచింగ్ సెంటర్లలలో మోటివేషన్ క్లాస్ లో నీకు ఎన్ని ఉద్యోగాలు కావాలి ఒక ఉద్యోగమే కావాలి కదా, దాని కోసమే కశ్టపడి చదువు అంటారు.దాంతో మన వాళ్ళు నేను ఆదివాసీ కాననుకొని చదువుతున్నారు,ఒక్క ఉద్యోగం కష్టపడుతున్నారు.తప్పులేదు,కానీ నీ ప్రక్కనే ఉన్న నీతోటి ఆదివాసీ కోసం ఆలోచించవా,నీకు కావాల్సిన ఒక్క ఉద్యోగం కూడా మైదాన గిరిజనుడో, బోగస్ గిరిజనుడో కొట్టుకొని పోతాడన్న విషయం నీకు తెలియడం లేదు.జిఓ3 లాంటి జిఓ లేదా చట్టం లేకపోతే అసలు రిజర్వేషనే లేకపోతే ఏ ఉద్యోగం ఆదివాసీకి రాదన్న విషయం గుర్తించకపోతే భవిష్యత్ లో చాలా నష్టం జరుగుతుందని, ఛత్తీస్ ఘర్ రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ లో ఆదివారం జరిగిన భారత ఆదివాసీ సమన్వయ సదస్సులో ఆంధ్రప్రదేశ్ లో ఆదివాసీల హక్కులు, చట్టాల మీద జరుగుతున్న దాడులను సదస్సులో ప్రస్తావించామని,సుప్రీంకోర్టు రద్దు చేసిన జిఓ 3 స్థానంలో షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం తీసుకురావాలని,ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి 1/70 భూబదాలయింపు నిషేధ చట్టం సవరణ చేయాలన్న వాఖ్యాలు,రంపచోడవరం ఆదివాసీ ఎమ్మెల్యే మిరియాల శిరీష భూబదాలయింపు నిషేధ చట్టానికి వ్యతిరేకంగా గిరిజనేతరులకు ఇల్లు ఇవ్వాలని అసెంబ్లీలో మాట్లాడిన విషయంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలైనా ఆంధ్రప్రదేశ్,తెలంగాణలలో వాల్మీకి, బోయలను గిరిజన జాబితాలో కలపాలని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తీర్మానాలను కేంద్రప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అమోదించవద్దని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేయాలని 12 రాష్ట్రాల నుండి హజరైన ఆదివాసీ ప్రతినిధుల ముందర ప్రతిప్రాదించమని, ఈ సదస్సుకు భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ ఛైర్మన్ మొట్టడం రాజబాబు,అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖి శేషాద్రి,అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కొర్ర మల్లేశ్వర్రావు,ఆర్ సి టివి ప్రతినిధి మఠం కేశవరావు పడాల్ హాజరైనట్లు తెలిపారు.
