
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ది. 26.03.2025
అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సమాఖ్య అల్లూరి సీతారామరాజు జిల్లా సంఘానికి భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.జాతీయ స్థాయిలో 1967లో నాగ్ పూర్ కేంద్రంగా ఏర్పాటు చేసిన అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సమాఖ్య అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం చాలా సంతోషమని,జిల్లా కమిటీ అసోసియేట్ అధ్యక్షుడుగా కొర్ర మల్లేశ్వర్రావు,అధ్యక్షుడుగా గదబరి సోంబాబు, ప్రధాన కార్యదర్శిగా కంగల శ్రీనివాస్,ఉపాధ్యక్షులుగా లకే వి ఎల్ ఎన్ పాత్రుడు, మట్ల క్రిష్ణరెడ్డి,కాక రాజు,కారం లక్ష్మీ వరప్రసాద్ లతో పూర్తి స్ధాయిలో జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర అధ్యక్షుడు మడావి నెహ్రూ, కార్యనిర్వాహక అధ్యక్షుడు చిట్టపులి శ్రీనివాస్ పడాల్,ఆర్గనైజైర్ సోమెల సింహాచలం లకు భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర కమిటీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ,భవిష్యత్తులో ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయడంలో సఫలీకృతులౌతారని ఆశాభావం వ్యక్తం చేశారు.