
మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
పయనించే సూర్యుడు మే 9 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
వామపక్ష పార్టీలు. ప్రజాసంఘాల డిమాండ్. నెల్లూరు జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వామ పక్ష పార్టీలు. మరియు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని. ప్రభుత్వం తక్షణమే కాల్పుల విరమణ పాటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేసారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని. ప్రభుత్వం మావోయిస్టుల పేరుతో చేస్తున్న దాడులలో అమాయక ఆదివాసీలు బలై పోతున్నారని ప్రభుత్వం తక్షణమే కాల్పుల విరమణ పాటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని. ఆపరేషన్ కగార్ అంతిమ యుద్ధం పేరిట గత జనవరి నుండి ఇంతవరకు ఐదు వందల మంది ఆదివాసీలను. మహిళలను. పాలు తాగే పసిబిడ్డలను బలి తీసుకున్నదని .ఆవేదన వ్యక్తం చేసారు. రాజ్యాంగ హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయని. కర్రె గుట్టలపై వున్న ఇరవై వేల మంది సైనిక బలగాలను వెనక్కు తీసుకుని, శాంతి చర్చలకు చొరవ చూపాలని సూచించారు. మధ్య భారతం లోని అడవులలో ఉన్న అపార సహజ వనరులను, ఖనిజ సంపదను కార్పోరేట్లకు కట్టబెట్టడానికి బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలపై. వారికి అండగా ఉంటున్న మావోయిస్ట్ ఉద్యమ కారులపై దాడులు చేస్తూ వుందని. దుయ్యబాట్టారు. అడవులను నిర్మూలిస్తూ. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ .భవిష్యత్తులో ఆక్సిజెన్ కూడా వ్యాపారం కాబోతున్నదని. ఈ దుర్మార్గాన్ని అన్ని ప్రజాస్వామిక శక్తులు సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు. దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలను నిలిపివేసి .శాంతి చర్చలు చేస్తున్నారని. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం సొంత ప్రజలపై యుద్ధం చేస్తూ వుందని. ప్రజల కోరిక మేరకు తక్షణమే మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాలకోరకే పనిచేస్తూ ఉందని. ఇది దేశ ప్రజల సంక్షేమానికి భంగకరమనివిమర్శించారు. మధ్యభారతం లో కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే లక్షలాది ఎకరాల అడవులను నిర్మూలిస్తున్నాయని. ముందు ముందు మరింత విధ్వంసం జరుగబోతున్నదని. మధ్య భారతం లోని అడవులను,ఆదివాసీలను కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉందని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్,సిపిఐ నాయకులు రామరాజు.మాలకొండయ్య,సిపిఐ ఎంఎల్ .న్యూ డెమోక్రసీ.నాయకులు సాగర్.ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కో కన్వీనర్ జువ్విగుంట బాబు.పౌరహక్కుల సంఘం నాయకులు అబ్బయ్యరెడ్డి.ఎల్లంకి వెంకటేశ్వర్లు . వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు