
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 11 అల్లూరి సీతరామరాజు జిల్లా చింతూరు పోతనపల్లి లో
ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి, చింతూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో, డివిజన్ ఛైర్మెన్ జల్లి నరేష్ నేత్రుత్వంలో చింతూరు మండలం పోతనపల్లి గ్రామ సభ సమావేశం గ్రామ పిన పెద్ద మడివి రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఇటీవలే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి, చింతూరు డివిజన్ కమిటీ అభ్యర్థన మేరకు, చింతూరు ఐ టి డి ఏ, పి ఓ, అపూర్వ భరత్ ఐ ఏ ఎస్ , పోతనపల్లి లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ సందర్బంగా స్థలం కేటాయింపు విషయాన్ని పోతనపల్లి గ్రామ సభలో చర్చించడం జరిగింది. ఆదివాసీ భవన్ కి స్థలం కేటాయింపును పోతనపల్లి గ్రామసభ స్వాగతించి, సంపూర్ణ అంగీకారాన్ని ఆమోదన్ని తెలిపింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి పోతనపల్లి గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. గ్రామ పెద్ద మడివి బాబురావు, అధ్యక్షులుగా, మడివి రాజయ్య ఉపాధ్యక్షులుగా, మడివి సుబ్బారావు ప్రధాన కార్యదర్శిగా, కార్యదర్శులుగా మడకం కన్నారావు తో పాటు 15 మందితో గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఏ పి ఏ జె ఏ సి సెంట్రల్ కమిటీ నాయకులు మడివి నెహ్రూ మాట్లాడుతూ.. ఆదివాసీ భవన్ కి స్థలం కేటాయించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అలానే అమోదించినందుకు పోతనపల్లి గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. అలానే పోతనపల్లి గ్రామ కమిటీ నేత్రుత్వం లో త్వరలోనే ఆదివాసీ భవన్ స్థలం క్లీనింగ్ పనులు మొదలుపెడతామని ఈ కార్యక్రమానికి డివిజనలోని అన్ని మండలాల ఏపీ ఏ జె ఏ సి కార్యకర్తలు, భాగస్వామ్య పక్షాళ నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఏ ఈ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారం దారయ్య, జిల్లా సహాయ కోశాధికారి మడకం లక్ష్మణ్, ఉద్యోగ జె ఏ సి జిల్లా నాయకులు తిమ్మ సాయి, ఏ టి ఏ జిల్లా గౌరవ అధ్యక్షులు శ్యామల సుబ్బయ్య, ఏపీ ఏ జె ఏ సి చింతూరు మండల ఛైర్మెన్ పొడియం రామకృష్ణ మరియు పోతనపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.

