
పయనించే సూర్యుడు, మార్చి 30, కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ ఎమ్మెల్యే ఇన్చార్జ్ మీనాక్షి నాయుడుఆదేశాల మేరకు ఘనంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేయడం జరిగింది, నందమూరి తారక రామారావు విగ్రహానికి పులహరం వేసి నివాళులర్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈవేడుకకు ఆదోని టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఉమాపతి మాట్లాడుతూ.ఈరోజు ఆదోని నియోజకవర్గం లో 40 గ్రామాలలో , 42 వార్డులలో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దినోత్సవం ఘనంగా జరిగాయి .తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారి వారి వార్డులలో మరియు, గ్రామాలలో పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆదోనిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మేము ఎంత చేసిన తక్కువే, నారా చంద్రబాబునాయుడు ఆదేశాలిస్తే, ఇక్కడ ఉన్న మన ఆదోని నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాలు ఏది ఇచ్చినా కూడా ఆదోనిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు పనిచేస్తారు, పార్టీ నాయకులకు కార్య కర్తలకు శ్రీ కొంకా మీనాక్షినాయుడు కుటుంబము ఎల్లప్పుడు ఋణపడి వుంటుందని తెలిపినారు .తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు అయినా కూడా, కార్యకర్తలకు పనులు చేయలేకున్నా కూడా ఇప్పటిదాకా మీనాక్షి నాయుడు నే నమ్ముకొని ఉన్నారు. ఉమాపతి నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పాదాభివందనాలు చేస్తున్నానని తెలిపినారు. ఎందుకంటే కార్యకర్తలకు ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా మా వెంటనే నడుస్తున్నారు .మేము ఏమి చెప్పినా కూడా పార్టీకి కష్టపడి పని చేస్తున్నారు అని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు పాల్గొనడం జరిగింది.