
పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 17:- రిపోర్టర్( కే.శివ కృష్ణ)
బాపట్ల:ఆపదలో ఉన్నవారికి ప్రతి ఒక్కరు సహాయం అందించి బాధితులకు అండగా నిలవాలని ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు అన్నారు.బాపట్ల మండలం మూరుకుండపాడు గ్రామానికి చెందిన బెజ్జం ఉషారాణి కి చెందిన పూరిళ్లు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి కట్టుబట్టలతో రోడ్డు పై ఉండటంతో ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాధితులకు రూ.5వేలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఆర్గనైజేషన్ సభ్యుల సహాయ సహకారాలతో అనేక ఇబ్బందులలో ఉన్న బాధితులకు ఆర్ధిక సహాయం అందిస్తున్నామని చెప్పారు.రాత్రి సమయంలో అగ్నిప్రమాదం సంభవించి నివాసంలో ఉన్న అన్ని వస్తువులు కాలిపోయి ఇబ్బందులు పడుతున్న బాధితురులకు కొంత మేర అండగా నిలిచామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి,షేక్ సుభాని,నరాలశెట్టి నాగరాజు,మద్దిబోయిన గోపి,నల్లపాటి కిషోర్, యర్రంశెట్టి పవన్, బండ్రెడ్డి అంకమ్మరావు,పులిపాటి రాజు, యాశం రాజా రమేష్,సుబ్బారావు,శ్రీను తదితరులు పాల్గొన్నారు.