
డాక్టర్ గుదే రాజారావు మాట్లాడుతూ ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని కోరుకుంటున్నాము.
పయనించే సూర్యుడు బాపట్ల మే:- 8 రిపోర్టర్ (కే. శివ కృష్ణ)
బైసరాన్ లోయలోని పహల్గామ్ సమీపంలోని పర్యాటక శిబిరంపై జరిగిన ఉగ్రదాడిలో తీవ్రవాదులు కుటుంబాల్లోని పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందిలో అందరూ పురుషులే. ఈ ఘటనతో అనేక మంది మహిళలు వితంతువులుగా మిగిలిపోయారు.ఈ దారుణానికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరు పెట్టడం వెనుక గొప్ప సంకేతార్థం ఉంది. “సిందూర్” భార్యగా ఉన్న మహిళ ధరించే పవిత్ర చిహ్నం. పురుషులను టార్గెట్ చేసిన దాడి వల్ల భార్యలు సింధూరాన్ని కోల్పోయినట్టైంది.ఈ నేపథ్యంలో, భారత సైన్యం ఆ మహిళలకు న్యాయం చేయడం కోసం, వారి భర్తల ప్రాణాలను పోగొట్టిన వారిపై ప్రతీకారం తీర్చడంలో భాగంగా ఈ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ సిందూర్’ అనే భావప్రధానమైన పేరు ఇచ్చిందని తెలియజేశారు.